గుడ్‌న్యూస్.. రెండురోజుల్లో తెలంగాణలో వానలు.. ఉరుములు, మెరుపులు కూడా
వర్షాల కోసం తెలుగు రాష్ట్రాల జనం ఎదురుచూస్తున్నారు. హై టెంపరేచర్ వల్ల.. ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. వీరికి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరో రెండు రోజుల్లో రుతు పవనాల ఆగమనం అని.. ఇక వర్షాలు పడతాయని తెలిపారు. నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, ముంబై, కొంకణ్ లోని చాలా ప్రాంతాలు, మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలోకి ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వచ్చే 48 గంటల్లో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలో రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. 2,3 రోజులలో తెలంగాణలోని మరికొన్ని భాగాలు, ఆంధ్రప్రదేశ్, బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అధికారులు వివరించారు.

పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని, రేపు, ఎల్లుండి తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఓమోస్తరు వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ వడ గాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications