హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీస్‌స్టేషన్‌లో మహిళ మృతి: కొట్టి చంపారని బంధువుల ఆరోపణ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని అసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. బోజగుట్టకు చెందిన పద్మ అనే మహిళను దొంగతనం కేసులో విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్‌లో ఉంచి పోలీసులు తమదైన శైలిలో విచారించినట్లు తెలిసింది.

అస్వస్థతకు గురైన పద్మను పోలీసులు హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పద్మ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు ఉస్మానియా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా, పోలీసుల దెబ్బలకు తాళలేకే పద్మ మృతి చెందిందని బంధువులు ఆరోపించారు.

ఇది ఇలా ఉండగా, పద్మ బంధువుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని డిసిపి సత్యనారాయణ అన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ పరిస్థితి విషమించడంతోనే పద్మ మృతి చెందిందని డిసిస తెలిపారు. పోస్టుమార్టం పూర్తయ్యాక పద్మ మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగిస్తామని చెప్పారు.

 A woman allegedly died in Police Station

మహిళను వేధించిన కేసులో ఎస్‌ఐ సస్పెండ్

ఓ మహిళను వేధించిన కేసులో ఎస్‌ఐ సస్పెన్షన్‌కు గురైయ్యాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ గిరిజన మహిళను వేధించాడన్న ఆరోపణలతో గుడిపల్లి ఎస్‌ఐ కొండల్‌రెడ్డిని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ సస్పెండ్ చేశారు.

కారు బోల్తా: ముగ్గురు ఎస్సైలకు గాయాలు

మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల మండలం దయ్యాలవాగు వద్ద ప్రమాదవశాత్తు కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఎస్సైలకు గాయాలైయ్యాయి. గద్వాల, ఐజ, మల్లకల్ ఎస్సైలు గాయాపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించారు.

English summary
A woman allegedly died in Asif Nagar Police Station in Hyderabad on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X