ఒంటరిగా వెళుతున్న మహిళ్యపై గ్యాంగ్‌రేప్

కాకర్‌జాల గ్రామానికి చెందిన ఓ వివాహిత (25) పని మీద కొల్లూరు గ్రామానికి వెళ్లింది. స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో రాత్రి 10 గంటల సమయంలో కాలినడకన బయలు దేరింది. చౌడూరు సమీపంలో కొల్లూరు గ్రామానికి చెందిన రఘు, రమేష్, శ్రీనివాసులు ఆమెను అడ్డగించారు.
ఆ తర్వాత పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సమీపంలోని వెంకటేశ్వర తండావాసులు బాధితురాలి అరుపులు విని అక్కడికి చేరుకొని వారికి దేహశుద్ధి చేశారు.
దీంతో నిందితులు ఆమెను పారిపోయారు. బాధితురాలు స్థానికుల సాయంతో బంధువులకు సమాచారం అందించింది. అదే రాత్రి నవాబ్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు.












Click it and Unblock the Notifications