బస్టాండ్‌లో దించివెళ్లిన భర్త: 3రోజులైనా తిరిగిరాని కాల్ సెంటర్ ఉద్యోగిని

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలోని ఓ కాల్‌ సెంటర్‌లో పనిచేస్తున్న ఓ వివాహిత మహిళ అదృశ్యమైన ఘటన గోపాలపురం ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాలిల ప్రకారం.. బంజారాహిల్‌ రోడ్డు నెంబర్‌ -12లో ఉంటున్న యాదగిరి భార్య రేణుక(23) ఘట్‌కేసర్‌లోని ఓ కాల్‌సెంటర్‌లో పనిచేస్తోంది.

 A woman call center employee missing in Hyderabad

అయితే ప్రతి రోజు భర్త యాదగిరి ఆమెను సికింద్రాబాద్‌లోని బ్లూసీ హోటల్‌ ప్రాంతం వద్దకు తీసుకుని వచ్చి వదిలి వెళ్తుంటాడు. ఆమె అక్కడ నుంచి బస్సులో పనిచేసే తన కాల్‌సెంటర్‌కు వెళ్తుంది. అయితే రోజుమాదిరిగా ఆగస్టు 1న ఆమెను భర్త యాదగిరి బ్లూసీ హోటల్‌ వద్ద వదిలివెళ్లాడు.

ఆమె సాయంత్రం ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన భర్త.. తెలిసిన బంధువులను వాకబు చేసినా ఆచూకీ తెలియరాలేదు. ఆమె ఫోన్‌ కూడా స్వీచ్ఛాప్‌ చేసి ఉందని, దీంతో తన భార్య కనిపించడంలేదని బాధితుడు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె కోసం గాలింపు చేపట్టారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman call center employee missing in Hyderabad on 1st August.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి