హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్లిక్ చేసింది, పెళ్లి పేరుతో మహిళ మోసపోయింది: పరారీలో మహిళ, ప్రధాన సూత్రధారి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్ల చేతిలో హైదరాబాదు మహిళ నిండా మునిగిపోయింది. పెళ్లి పేరిట మాయ చేసి ఆమె వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేశారు. వివాహ వెబ్‌ సైట్‌లో నగరానికి చెందిన ఓ మహిళ అక్టోబరులో తన పేరును రిజిస్ట్రర్‌ చేసుకుంది. ఆమె ప్రొఫైల్‌ నచ్చిందంటూ స్మిత వాల్టర్‌ పేరితో రిప్లై వచ్చింది.

దాంతో ఆమె అతనితో చాటింగ్ ప్రారంభించింది. ఇద్దరూ కొద్దిరోజులు ఒకరి గురించి మరొకరు తెలుసుకున్న తర్వాత స్మిత వాల్టర్‌ మ్యారేజీ ప్యాకేజీ బహుమతులు పంపుతున్నట్లు ఈ మెయిల్‌ ద్వారా సమాచారం పంపించాడు. ప్యాకేజీలో ఖరీదైన ఆభరణాలు, ట్రావెలర్స్‌ చెక్స్‌, ల్యాప్‌ట్యాప్‌, మొబైల్స్‌, దస్తులు పంపుతున్న ట్లు చెప్పాడు.

ఈ క్రమంలో ఈ నెల 2, 4 తేదీల్లో ఆమెకు కనిక శర్మ పేరిట ఫోన్ కాల్‌ వచ్చింది. ముంబై ఛత్రపతి విమానాశ్రయంలో ఆమె చిరునామాతో ప్యాకేజీ వచ్చిందని చెప్పాడు. పన్నుల నిమిత్తం రూ.42,500 బ్యాంకు ఖాతాలో జమ చేయాలని సూచించాడు. ఇలా వేర్వేరు కార ణాలను చూపుతూ.. దఫాల వారీగా అమన అక్తర్‌ అన్సారీ పేరిట ఎస్‌బీఐ, హెచడీఎప్‌సీ బ్యాంకుల ఖాతాల్లో రూ.9,59,500 జమ చేయించాడు.

చివరగా పెద్ద మొత్తంలో డబ్బు జమ చేయాలని ఆదేశించాడు. దీంతో అనుమానం వచ్చిన ఆ మహిళ సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీ సులను ఆశ్రయించింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన ఏసీపీ ఎస్‌.జయరాం, ఇనస్పెక్టర్‌ బాలకృష్ణారెడ్డిలు మోసగాళ్ల తీగలాగారు. దీంతో నైజీరియన్ల ముఠా డొంక కదిలింది. మహిళ జమ చేసిన బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

Woman cheated by nigerains in Hyderabad

ఇలా తరలిస్తారు..

బాధితుల నుంచి వచ్చిన నగదును పోలీసులకు దొరకకుండా ఉండేందుకు నైజీరియన్ క్రిమినల్స్‌కు చెందిన ఏజెంట్‌లు హవాల ద్వారా నగదు ప్రధాన సూత్రధారికి చేరవేస్తున్నారు. హైదరాబాద్‌లో ఖాతాలు ఉన్న ఏజెంట్‌లు వారి అకౌంట్లో డబ్బు పడగానే వెంటనే వాటిని విత్‌డ్రా చేస్తారు. ఆ తర్వాత ఆ నగదును సికింద్రాబాద్‌లోని హవాలా ఏజెంట్‌లు చంద్ర , పుష్కర్‌కు అందిస్తారు.

వీరు ముంబైలోని తమ ఏజెంట్‌లు పవన్‌కుమార్ చందక్, చేతన్ మావ్జీ మమానియా ద్వారా నైజీరియన్ జాన్ ఎమన్కే అలియాస్ సండే అందిస్తారు. అతను ఆ నగదును సండే ప్రధాన సూత్రధారి స్మిత్ వాల్టేర్ అలియాస్ అలెగ్జాండర్ చిడ్డీకి చేరవేస్తారు. ఈ విధంగా నైజీరియన్ మోసగాళ్లు మ్యాట్రీమోనియల్ తో పాటు ఇతర మోసాలకు సంబంధించిన నగదును హవాలా ద్వారా తరలిస్తున్న కొత్త రూటు పోలీసులకు దొరికింది.

ఈ కేసులో 12 మంది నిందితులతో సహా నైజీరియన కెలాఛి జాన యెమెనికే అలియాస్‌ సండేలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.6,97,000 నగదు, నైజీరియా పాస్‌పోర్టు, 49 ఏటీఎం/ డెబిట్‌ కార్డులు, 55 చెక్‌బుక్స్‌, 21 బ్యాంకు పాస్‌ పుస్తకాలు, 19 మొబై ల్‌ ఫోన్లు, 09 ఓటరు గుర్తింపు కార్డులు, 15 పానకార్డులు, 02 ఆధార్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి స్మిత్ వాల్టేర్, కనిష్క శర్మ, మరి కొంత మంది ఏజెంట్‌ల కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు.

English summary
Nigerian cheated a Hyderabad woman in the pretext of marraige.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X