మహిళ క్షణికావేశం: కూతుళ్లపై కిరోసిన్ పోసి తానూ పోసుకుని..

భువనగరి: క్షణికావేశంలో ఓ మహిళ తాను మరణించడమే కాకుండా తన కూతురిని కూడా వెంట తీసుకుని వెళ్లింది. భర్త మందలించడానికి మనస్తాపానికి గురైన మహిళ తన ఇద్దరు కూతుళ్లపై కిరోసిన్ పోసి, తన ఒంటిపై కూడా పోసుకుని నిప్పంటించుకుంది.

ఆ ఘటనలో మహిళతో పాటు ఆమె కూతురు మరణించగా, మరో కూతురు ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన శుక్రవారం యాదాద్రి జిల్లా బీబీనగర్ మంలం గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని మధిరగూడలో చోటు చేసుకుంది.

 ఆరేళ్ల క్రితం పెళ్లి

ఆరేళ్ల క్రితం పెళ్లి

బీబీనగర్ మండలంలోని రహీంఖాన్ గూడెం గ్రామానికిచెందిన ఈతబోయిన భిక్షపతి కుటుంబంతో సహా బోడుప్పల్‌లో నివాసం ఉంటున్నాడు. తన పెద్ద కూతురు నిర్మల (25)ను బీబీనగర్ మడలం మధిర గూడూరులోని తన సోదరి జయమ్మ పెద్ద కుమారుడు జుర్రు శ్రీశైలంకుఇచ్చి ఆరేళ్ల క్రితం పెళ్లి చేశాడు.

కొట్టినందుకు మందలించాడు

కొట్టినందుకు మందలించాడు

శ్రీశైలం, నిర్మల దంపతులకు నాలుగేళ్ల కూతురు ప్రజ్ఞ (లక్కి), 18 నెలల మరో కూతురు శ్రుతి (కుట్టి) ఉన్నారు. కొద్ది రోజుల క్రితం కుటంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. దగ్గు, జ్వరంతో బాధపడుతున్న కూతుళ్లు విసిగిస్తున్నారన నిర్మల వరిని కొట్టింది. దీంతో ఆగ్రహించిన భర్త శ్రీశైలం నిర్మలను మందలించాడు.

భర్త మందలించినందుకు

భర్త మందలించినందుకు

భర్త మందలించడంతో మనస్తాపానికి గురైన నిర్మల శ్రీశైలం బయటకు వెళ్లిపోగానే ఇద్దరు కూతుళ్లపైకిరోసిన్ పోసి, తనపై పోసుకుని నిప్పంటించుకుంది. పెద్ద కూతురు ప్రజ్ఞ నిప్పు అంటిస్తుండగా ఇంట్లోకి పరుగెత్తి ప్రాణాలు కాపాడుకుంది. చిన్న కూతురు శ్రుతి అక్కడిక్కకడే మరణించింది. నిర్మల కూడా మరణించింది.

 వారిని అదుపులోకి తీసుకుని...

వారిని అదుపులోకి తీసుకుని...

మృతురాలి భర్త శ్రీశైలం, అత్త జయమ్మ, మరిది నరేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన అల్లుడు మంచివాడేనని, అయితే అత్త జయమ్మ, మరిది నరేష్ మాటలు విని తన కూతురును వేధిస్తూ వచ్చాడని నిర్మల తండ్రి భిక్షషతి అంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+