కూతురు మృతి: పేరెంట్స్ కన్నీరుమున్నీరు (పిక్చర్స్)
హైదరాబాద్: వరకట్నం వేధింపులకు ఓ వివాహిత బలైన సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకుందని అత్తింటి వారు చెబుతుండగా.... భర్త, అత్త, ఆడపడుచులు, ఎస్సైగా పనే చేస్తున్న ఆ ఇంటి అల్లుడి వేధింపులతోనే ఆమె చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం ఇది జరిగింది. స్థానికులు, మృతురాలి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం...
వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం నేనాల గ్రామానికి చెందిన నర్సయ్య, అనసూయ దంపతుల కుమార్తె లలిత (24) ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఈమెకు గత ఏడాది ఫిబ్రవరి 9న నల్గొండ జిల్లాకు చెందిన సుమన్ (29)తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.10 లక్షలు, బంగారం, ప్లాట్ కట్నంగా ఇచ్చారు. సుమన్ వికారాబాదులో అటవీశాఖలో ఎఫ్ఎస్ఓగా పని చేస్తున్నాడు.
మారుతినగర్ సత్యానగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. సుమన్ తల్లి రామలింగమ్మ, సోదరి చైతన్య వీరి వద్దే ఉంటున్నారు. పెళ్లైన దగ్గర నుండి సూటిపోటీ మాటలతో లలితను భర్త, అత్త, ఆడపడుచు వేధిస్తున్నారు. ఇటీవలె పదోన్నతి వచ్చిన సుమన్ అదనపు కట్నం కావాలని లలితను వేధిస్తున్నాడు. నెల రోజుల క్రితం లలిత పైన చేయి చేసుకున్నాడు. ఆమెకు గాయమైంది. ఆమె తల్లిదండ్రులు వచ్చి సరూర్ నగర్ మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి రాజీ కుదిర్చారు. ఇటీవల మరోసారి గొడవ జరిగింది. లలిత వద్ద సెల్ ఫోన్ లేకపోతేనే కాపురం చేస్తానని, లేదంటే పుట్టింటికి పంపిస్తానని సుమన్ బెదిరించాడు. ఇదిలా ఉండగా.. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో లలిత అనుమానాస్పద స్థితిలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెంది ఉంది. పోలీసులు సంఘటన స్థలానని పరిశీలించారు. భర్త సుమన్, అత్త రామలింగమ్మను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

మహిళ ఆత్మహత్య
లలిత ఆత్మహత్య చేసుకుందని తెలిసిన తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ వచ్చారు. వారి కన్నీరుమున్నీరు అయ్యారు. తమ బిడ్డను అత్తింటి వారే పెట్టన పెట్టుకున్నారని ఆరోపించారు.

మహిళ ఆత్మహత్య
తన కూతురు చావుకు కారణమైన వారిని ఘటనా స్థలానికి తీసుకు వచ్చే వరకు శవాన్ని తీయనీయమని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భీష్మించారు.

మహిళ ఆత్మహత్య
పోలీసులు జోక్యం చేసుకొని తహసీల్దారుకు సమాచారం అందించారు. ఆయన సమక్షంలో పంచనామా చేసి శవాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.

మహిళ ఆత్మహత్య
అత్తింటి వారు అదనపు కట్నం కోసం తమ కూతురును పొట్టన పెట్టుకున్నారని, ఒక ఎస్సై అండతోనే అత్త, భర్త కలిసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.

మహిళ ఆత్మహత్య
వరకట్నం వేధింపులకు ఓ వివాహిత బలైన సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకుందని అత్తింటి వారు చెబుతుండగా.... భర్త, అత్త, ఆడపడుచులు, ఎస్సైగా పనే చేస్తున్న ఆ ఇంటి అల్లుడి వేధింపులతోనే ఆమె చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications