భవనంపై నుంచి దూకి టెక్కీ భార్య ఆత్మహత్య
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా పాల్వంచలో సోమవారంనాడు దారుణం జరిగింది. అపార్టుమెంట్ బిల్డింగ్‌పై నుండి దూకి ఓమహిళ అనుమానస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కైపు శ్రీధర్ భార్య కైపు సంగీత (30) పాల్వంచలోని గట్టాయిగూడెంలోగల ఒక అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న తన తల్లిదండ్రులైన జిల్లెల యాదగిరిరెడ్డి ఇంటికి మూడునెలల కిందట డెలివరీ కోసం వచ్చింది.
కాగా 27 రోజుల కిందట సంగీత ఆడపిల్లకు జన్మనిచ్చింది. కుటుంబసభ్యులు ఎంతో ఆనందంగా ఇటీవల బారసాల జరుపుకున్నారు. ఇంతలోనే ఏమిజరిగిందో ఏమో తెలియదు కానీ సంగీత అకస్మాత్తుగా అపార్టుమెంట్ పైకి ఎక్కి అక్కడ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం నుండి తమతో ఏంతో ఆనందంగా ఉన్న తమ కుమారై కనురెప్పపాటులో ఆత్మహత్యకు పాల్పడి మరణించిన విషయాన్ని అపార్టుమెంట్ వాచ్‌మెన్ చెప్పడంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.

సంగీత తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉన్న తమ అల్లుడు శ్రీధర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. పాల్వంచ సిఐ ఎంఎ షుకూర్ సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబసభ్యుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మృతురాలికి ఐదు సంవత్సరాల కుమారై జాన్‌వి, 27రోజుల వయస్సు ఉన్న చిన్నకుమారె్తై ఉన్నారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా సంగీత మృతిచెందిన సంఘటన పలు అనుమానాలకు తావిస్తోంది.












Click it and Unblock the Notifications