9ఏళ్లు పెద్ద మహిళతో సహజీవనం, పెళ్లి చేసుకోమంటే: మాయమాటలతో అమ్మేశాడు
హైదరాబాద్: పెళ్లయి ఇద్దరి పిల్లలు ఉన్న మహిళలతో అయిదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు ఓ వ్యక్తి. పెళ్లి చేసుకోవాలని ఆమె కోరడంతో ముఖం చాటేస్తున్నాడు. ఈ సంఘటన హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో చోటు చేసుకుంది. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది.
అంతేకాదు, ఆ వ్యక్తి వారికి పుట్టిన బిడ్డలను కూడా విక్రయించాడు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బి.తాడిపత్రి గ్రామానికి చెందిన సురేష్ (27) హైదరాబాదులోని రహ్మత్ నగర్‌లో ఉంటున్నాడు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో పని చేస్తున్నాడు.

సురేష్‌తో ఇలా పరిచయం
అప్పటికే పెళ్లైన తనకంటే తొమ్మిదేళ్లు పెద్దది అయిన సికింద్రాబాద్‌కు చెందిన స్వప్న (36)తో ఇతనికి పరిచయం ఏర్పడింది. స్వప్నకు అప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్తతో విబేధించి ఆమె అతనికి దూరంగా ఉంటూ పిల్లలను చెల్లి వద్ద ఉంచుతోంది. ఈ క్రమంలో సురేష్‌తో పరిచయం ఏర్పడింది. అతను పని చేసే సంస్థలోనే ఉద్యోగంలో చేరింది.

వీరికి ఇద్దరు పిల్లలు
ఇద్దరూ రహ్మత్‌నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉన్నారు. వీరికి 2014లో ఒక బాబు, 2015లో ఒక ఆడపిల్ల పుట్టింది. సురేష్ స్వప్నకు మాయమాటలు చెప్పి ఆ పిల్లలను విక్రయించాడు. కొద్ది నెలలుగా అందరి ముందు పెళ్లి చేసుకోవాలని స్వప్న కోరుతోంది. అతను మాత్రం అప్పటి నుంచి తప్పించుకుంటున్నాడు.

పోలీసులకు ఫిర్యాదు
ఆమె మరింత ఒత్తిడి చేసింది. దీంతో రెండు నెలలుగా కనిపించడం లేదు. బాధితురాలు నవంబరు 24న పోలీసులను ఆశ్రయించింది. తనను పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని, పిల్లలనూ విక్రయించాడంటూ ఫిర్యాదులో పేర్కొంది.

కేసు నమోదు చేసి అరెస్ట్
పోలీసులు సురేష్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలోనే ఉన్నాడు. తాజాగా, శనివారం నిందితుడిని అరెస్టు చేశారు. రిమాండ్ తరలించారు. శిశువుల విక్రయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications