హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దంపతుల అదృశ్యం, కారులో చంద్రకళ శవం: హత్యా, ఆత్మహత్యా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాదు బొల్లారంలోని కార్ల సీజింగ్ యార్డు నుంచి అదృశ్యమైన దంపతుల కేసులో చిక్కుముడులు వీడడం లేదు. ఆ కేసు కొలిక్కి వచ్చినట్లే కనిపించింది. కానీ, మరిన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయిు. మహిళ శవం బీదర్ వద్ద కారులో కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా, ఆమెను ఎవరైనా హత్య చేశారా అనే విషయం తేలడం లేదు.

భార్య చంద్రకళను భర్త అంబారావు పాటిల్ హత్యచేసి శవాన్ని ఇక్కడి నుంచి తరలించి ఉండవచ్చని పోలీసులు తొలుత భావించి ఆ దిశలో దర్యాప్తు చేశారు. దర్యాప్తు భాగంగా బీదర్‌లో తలదాచుకున్న చంద్రకళ భర్తను విచారించారు. దాంతో అంతుచిక్కని విషయాలు చాలా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

గత నెల 30న అంబారావు భార్యను బొల్లారం సీజింగ్ యార్డులోను కాపలా ఉంచి ఊరికి వెళ్లినట్టు తెలిసింది. మరుసటి రోజే భార్యకు ఫోన్ చేస్తే ఎంతకీ లేపక పోవడంతో అనుమానం వచ్చిన అంబారావు హుటాహుటిన హైదరాబాద్‌కు తిరిగి వచ్చి చూసేసరికి కారులో చంద్రకళ అప్పటికే చనిపోయి ఉంది.

Woman dead body in car: Suicide or murder?

ఈ విషయం పోలీసులకు తెలిస్తే తనను ఎక్కడ జైళ్లో పెడతారేమోననే భయంతో అంబారావు అతడి మిత్రుడు అంబులెన్సులో చంద్రకళ మృతదేహాన్ని తీసుకువెళ్లి బీదర్ ప్రాంతంలో వదిలి వెళ్లిపోయినట్లు సమాచారం. నిర్మానుష్యమైన ప్రదేశంలో మహిళ మృతదేహం పడి ఉండడంతో స్థానిక పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బొల్లారంలో అద్యశ్యమైన మహిళ శవమేననని గుర్తించి, ఇక్కడి పోలీసులకు ఇచ్చినట్లు తెలిసింది.

బీదర్‌లో గుర్తుతెలియని శవంగా లభించిన చంద్రకళ మృతదేహానికి బీదర్ ప్రాంతానికి చెందిన ఐదుగురు మహిళా డాక్టర్ల బృందం పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, చంద్రకళ శరీరంపై ఏ విధమైన గాయాలు, కత్తిపోట్లు, అత్యాచార సంబంధిత ఆనవాళ్లు లభించలేదని పోలీసులు చెబుతున్నారు.

చంద్రకళ హత్యకు గురైందా లేక ఆత్మహత్య చేసుకుందా అని తేల్చడానికి ఒక్క ఆధారం కూడా పోలీసులకు లభించలేదని అంటున్నారు. చంద్రకళ భర్త ఈ విషయంలో తన ప్రమేయమేమీ లేదని, కేవలం మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించడం తప్ప తనకేమీ తెలియదని పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. దీంతో చంద్రకళకు ఏమైన శారీరక రుగ్మతలు, రోగాలు ఉన్నాయా? వాటిని భరించలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

English summary
In a missing case, woman Chandrakala found dead in a car near bedar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X