కాలువ కట్టపై మహిళ శవం: రేప్ చేసి, హత్య చేశారా?
వరగంల్: వరంగల్ నగరంలోని కాకతీయ కెనాల్ కట్టపై గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు. గురువారం ఉదయం స్థానికులకు మృతదేహం కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.
దాదాపు 30 ఏళ్ల వయస్సు గల మహిళగా ఆమెను గుర్తించారు. ఆమెపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కాలిపోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. మట్టేవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగాల పేరుతో మోసం

ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసానికి పాల్పడిన ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. లండన్‌లో ఉద్యోగాలిప్పిస్తామంటూ గ్లోబల్ ప్లేస్‌మెంట్ పేరుతో రూ.2 కోట్లు వసూలు చేసిన హేమంత్ కుమార్, అకుల్ తవ్యను పోలీసులు అరెస్టు చేశారు.
వీడని బాలుడి కిడ్నాప్ మిస్టరీ
హైదరాబాద్ నగరంలోని హయత్‌నగర్‌లో కిడ్నాప్‌కు గురైన బాలుడి ఆచూకి ఇంకా లభ్యం కాలేదు. మూడు రోజుల క్రితం సూర్యానగర్ కాలనీలో నవీన్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఏడేళ్ల ఈ బాలుడిని గుర్తు తెలియని దుండగులు తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.
హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతో కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications