ఫేస్‌బుక్ ప్రేమ పెళ్లి: యువతి మృతి, కావాలనే తోసేశాడని అనుమానం

Posted By:
Subscribe to Oneindia Telugu

పెద్దపల్లి: పెద్దపల్లి మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శారద అనే నవ వధువు గాయపడి, ఆ తర్వాత మృతి చెందింది. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.

తాము గోదావరిఖని నుంచి చొప్పదండికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా కింద పడిన శారద తీవ్రగాయాల పాలైనట్లు భర్త చెబుతున్నారు. అయితే, మృతురాలి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రాణం తీసిన క్రికెట్: బ్యాట్, స్టంప్స్‌తో కొట్టి చంపారు

గోదావరిఖని కల్యాణ్‌నగర్‌కు చెందిన రాజ్ కుమార్‌కు, చొప్పదండికి చెందిన శారదకు ఫేస్‌బుక్‌ ద్వారా ఏర్పడిన పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారితీసింది.

Woman dies in Peddapalli on Saturday evening.

పెద్దలను ఒప్పించి మూణ్ణెళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వైవైహిక జీవితంలో గొడవలు ప్రారంభమయ్యాయి. భార్యభర్తల మధ్య గొడవలు, పెద్దలు సర్దిచెప్పి పంపించడం జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ప్రమాదంపై మృతురాలి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పేరిట పెళ్లి చేసుకున్న రాజ్‌కుమార్‌ అదనపు వరకట్నం కోసం నిత్యం తమ కుమార్తెను వేధిస్తున్నాడనీ, శుక్రవారం రాత్రి కూడా తమ కుమార్తెను తీవ్రంగా కొట్టడమే కాకుండా, ఆ విషయాన్ని అతనే ఫోన్‌లో చెప్పారని శారద తల్లిదండ్రులకు చెబుతున్నారు.

రోడ్డు బాగా ఉన్న ప్రాంతంలో తమ కుమార్తె వాహనం పైనుంచి జారిపడినట్లు చెప్పటం అనుమానంగా ఉందని, కావాలనే వాహనంపై నుంచి తోసివేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Woman dies in Peddapalli on Saturday evening.
Please Wait while comments are loading...