రేషన్ కార్డు ఇప్పిస్తామని వివాహితపై గ్యాంగ్ రేప్
మెదక్: రేషన్ కార్డు ఇప్పిస్తామని నమ్మబలికి వాహనంపై తీసుకుని వెళ్లి ఇద్దరు వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో జరిగింది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని ఝరాసంగం మండలం జీర్లపల్లిలో చోటు చేసుకుంది.
అయితే, ఇద్దరు నిందితులు కూడా పరారీలో ఉన్నారు. జహీరాబాద్ రూరల్ సీఐ రఘు కథనం ప్రకారం - గ్రామానికి చెందిన వివాహిత మంగళవారం రేషన్ బియ్యం కోసం డీలర్ వద్దకు వెళ్లి వస్తుండగా దారిలో అదే గ్రామానికి చెందిన నాయకుడి కిష్టయ్య, దూదేకుల నవాబ్‌లు ఆపి విషయం అడిగారు.

తనకు రేషన్ బియ్యం రెండు నెలల నుంచి రావడంలేందటూ ఆమె తెలిపింది. తాము రేషన్‌కార్డు ఇప్పిస్తామంటూ వారు ఝరాసంగంకు రావాలంటూ ఆమెకు మాయమాటలు చెప్పారు. నవాబ్ తన టీవీఎస్ ఎక్సెల్‌పై కిష్టయ్యతో పాటు ఆమెను తీసుకెళ్లారు.
బోరెగౌవ్ శివారులోకి రాగానే ఆమెను పొదల్లోకి లాగి బలవంతంగా సామూహిక లైంగికదాడి చేశారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.












Click it and Unblock the Notifications