మొండెం లేని మహిళ తల కేసును ఛేధించిన పోలీసులు: నిందితుడి ఫ్రిజ్‌లో ఆమె శరీర భాగాలు
హైదరాబాద్: దాదాపు వారం రోజుల క్రితం నగరంలోని మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో లభ్యమైన మొండెం లేని మహిళ తల కేసును పోలీసులు ఛేధించారు.మొండెం లేని తల కేసులో చనిపోయిన మహిళ ఎర్రం అనురాధగా గుర్తించారు. ఇదే విషయాన్ని మృతురాలి సోదరి, బావ ధృవీకరించారు. అనురాధ కేర్ ఆస్పత్రిలో నర్సుగా పని చేసేదని పోలీసులు చెప్పారు.
అయితే, మృతురాలు వడ్డీ వ్యాపారం కూడా నిర్వహిస్తోందని.. డబ్బు విషయంలోనే గొడవలు జరిగి హత్యకు గురైనట్లు ఆమె సోదరి వెల్లడించారు. అనురాధను చంపిన తర్వాత ఆమె డెడ్ బాడీని ముక్కలుగా చేసి, నిందితుడు ఫ్రీజ్‌లో దాచాడని పోలీసులు గుర్తించారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య చేసి.. మూసీ పరిసరాల్లో తల విసిరివేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తీగలగూడ మూసి పరివాహక ప్రాంతంలో ఆరు రోజుల క్రితం ఒక నల్లటి కవర్ లో గుర్తు తెలియని మహిళ తల కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే మలక్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీమ్ , డాగ్ స్క్వాడ్ లతో దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో విచారణ జరిపారు.
అడిషనల్ డీసీపీ ఆనంద్, మలక్ పేట ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్, మలక్ పేట, చాదర్ ఘాట్ క్రైం సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తీగలగూడ మూసి పరివాహక ప్రాంతంలో మహిళ తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ కేసును చేధించేందుకు ఎనిమిది పోలీసు బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశాయి.
ఈ క్రమంలో అనురాధను హత్య చేసింది ఆమెకు తెలిసిన వ్యక్తి చంద్రమోహన్‌గా గుర్తించారు. గతంలో అనురాధ వద్ద 7 లక్షల రూపాయలను వడ్డీకి తీసుకున్నాడని.. డబ్బులు అడగడంతో ఆమెను చంద్రమోహన్ హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. మృతురాలు అనురాధ ఇదే ఇంట్లో కిరాయికి ఉంటోంది. చంద్రమోహన్ ఆన్ లైన్ ట్రేడింగ్ చేస్తాడని పోలీసులు చెప్పారు.
కాగా, అనురాధ ఒంటరి మహిళ. చైతన్యపురిలోని చంద్రమోహన్ ఇంట్లోని ఫ్రిజ్‌లో ఉన్న అనురాధ డెడ్ బాడీ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. హత్య అనంతరం అనురాధ తలను వేరు చేసిన చంద్రమోహన్.. ఆమె ఇతర శరీర భాగాలను ముక్కలు చేసి ఫ్రిజ్‌లోనే దాచడం గమనార్హం.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications