మాజీ డీజీపీ భార్యకు యువతి రూ.20 లక్షలు టోకరా, అరెస్టు
హైదరాబాద్: మాజీ డీజీపీ భార్యను నమ్మించి రూ.20 లక్షలు తీసుకున్న సంఘటన హైదరాబాదులో వెలుగు చూసింది. ఓ యువతి నమ్మించి డబ్బులు తీసుకొని మోసం చేసిందని మాజీ డీజీపీ సతీమణి మంగళవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బంజారాహిల్స్‌లో నివసించే అనితకి జూబ్లీహిల్స్‌లో నివసించే మాజీ డీజీపీ అప్పారావు సతీమణి శ్రీదేవితో పరిచయం ఉంది. ఈ క్రమంలో శ్రీదేవి నుంచి అనిత రూ.20 లక్షలు తీసుకుంది. బొటిక్ ఏర్పాటు కోసం అని చెప్పి 2012లో ఆ మొత్తాన్ని తీసుకుంది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. 2014లో ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన ఒక చెక్కును శ్రీదేవికి ఇచ్చింది. ఆ చెక్కు బౌన్స్ అయింది. ఆ తర్వాత అనిత ఇల్లు మారిపోయిది. అనంతరం శ్రీదేవి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనితకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత అరెస్టు చేశారు.

రైతులను ఆదుకోవాలని టవర్ ఎక్కి ఆందోళన
ఖమ్మం జిల్లాలోని రైతులకు పంట నష్టపరిహారం మంజూరు చేయాలనీ, కరవు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ మామునూరు సర్పంచి గూడూరు రమణా రెడ్డి మంగళవారం పురుగుమందు డబ్బా తీసుకుని గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు.
ఉదయం 10.30గంటలకు టవర్ ఎక్కిన ఆయన సాయంత్రం 5.30గంటల వరకు టవర్ పైనే ఉన్నారు. సమాచారం అందుకున్న తహసీల్దార్, ఎస్సై తదితరులు టవర్ వద్దకు చేరుకొని పరిస్థితిని అధికారులకు ఫోన్లో వివరించారు. చివరకు జేడీఏ ఖమ్మం నుంచి వచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగారు.












Click it and Unblock the Notifications