తండ్రి రెండో పెళ్లితో మనస్తాపం చెంది భవనంపై నుంచి దూకిన యువతి

హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో భవనంపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కూకట్ పల్లిలోని బాలాజీనగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్‌లో శిరీష అనే యువతి ఉంటోంది. అయితే గురువారం సాయంత్రం ఆమె ఒక్కసారిగా హాస్టల్ మూడో అంతస్తు పైనుంచి కిందకు దూకింది.

Woman jumped from a building in kukatpally, Hyderabad

దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

తండ్రి రెండో పెళ్లి చేసుకోవడం వల్ల ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ శిరీష స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకు వెళ్తోంది. అయితే, ఆమె తండ్రి ఇటీవల రెండో వివాహం చేసుకున్నడాు. దీంతో మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్యయత్నం చేసింది.

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

చిన్నారికి చాక్లెట్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇందిరానగర్‌లో చోటు చేసుకుంది. స్ధానికంగా ఇంటి ముందు ఆడుుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని ఇంటి పక్కనే ఉన్న ఆచన్న (46) అనే వ్యక్తి చాక్లెట్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

రక్తపు మరకలతో ఇంటికి వచ్చిన చిన్నారిని చూసిన తల్లిదండ్రులు, స్థానికులు నిందితుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+