అమ్మ చెప్పొద్దని అన్నది: ప్రియుడితో కలిసి భర్త హత్య, పట్టించిన కూతురు మాటలు!

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్‌లో భర్త బానోతు జగన్ నాయక్‌ను భార్య దేవిక ఇటీవల హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమె ప్రియుడితో కలిసి భర్తను చంపింది. తొలుత ఆవేశంలో తానే భర్తను చంపానని చెప్పింది. కానీ ఆమె కూతురు మాటలు, ఇంటి యజమాని అనుమానం కారణంగా పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.

తన పిల్లల కోసం కోపంలో తన భర్తను నేనే చంపేశానని జగన్ సతీమణి దేవిక పోలీసుల ఎదుట నమ్మబలికారు. పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోనే కేసును చేధించారు. దేవికతో పాటు ప్రియుడు బెనర్జీని పోలీసులు అరెస్టు చేశారు. ఏం చెప్పవద్దని తనకు అమ్మ చెప్పిందని కూతురు చెప్పడంతో తల్లి దాదాపు దొరికిపోయింది. వివాహేతర సంబంధం కారణంగానే హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు.

 వివాహేతర సంబంధానికి దారి తీసిన పరిచయం

వివాహేతర సంబంధానికి దారి తీసిన పరిచయం

మంగళవారం తెల్లవారుజామున జగన్‌ను భార్య దేవిక హత్య చేసింది. ఆమెను పోలీసులు మంగళవారం సాయంత్రం వరకు విచారించారు. హత్య చేసినట్లు అంగీకరించింది. సాంకేతిక ఆధారాలు సేకరించారు. స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేవిక రెండేళ్ల క్రితం ఫిల్మ్ నగర్‌లోని అడ్వాన్స్‌ బీపీఓ సంస్థలో హౌజ్‌ కీపింగ్‌ విభాగంలో చేరింది. కృష్ణా జిల్లా నాగయలంక మండలం సమీపంలోని బర్రాంకుల గ్రామానికి చెందిన తోట బెనర్జీ(35) అదే కార్యాలయంలో పని చేసేవాడు. ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

భర్త కంటపడకుండా వచ్చిపోయేవాడు

భర్త కంటపడకుండా వచ్చిపోయేవాడు

ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో ఇంట్లో గొడవలు జరిగాయి. దేవికను పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులను బెనర్జీ అడిగాడు. దీనికి వారు అంగీకరించలేదు. వారితో గొడవపడ్డాడు. దేవిక సోదరులు బెనర్జీని కొట్టారు. మరోవైపు బానోతు జగన్‌ వారి కార్యాలయానికి వెళ్లి గొడవ చేసి, ఆమెను ఉద్యోగం మాన్పించారు. అయినా వారి సంబంధం కొనసాగింది. బెనర్జీ, దేవిక కలిసి మూడు నెలలుగా జగన్‌ హత్యకు పథకం పన్నుతున్నారు. జగన్‌ రెండు నెలల క్రితం జ్ఞానిజైల్‌సింగ్ నగర్‌లో ఓ భవనంలో మూడో అంతస్తులో అద్దెకు తీసుకున్నాడు. ఆ పైన పెంట్‌ హౌజ్‌‌లో బెనర్జీ దిగాడు. జగన్‌ కంటపడకుండా వచ్చిపోయేవాడు.

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ముఖంపై బోర్లించి..

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ముఖంపై బోర్లించి..

ఇదిలా ఉండగా సోమవారం రాత్రి జగన్ మద్యం తాగాడు. రాత్రి పన్నెండున్నర దాకా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత జగన్‌ నిద్రపోయాడు. దేవిక పైన పెంట్ హౌజ్‌‌లో ఉన్నబెనర్జీని పిలిచింది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో భార్యను, ఆమె ప్రియుడిని జగన్‌ చూశాడు. దీంతో మళ్లీ గొడవ జరిగింది. ఈ సమయంలో బెనర్జీ ఎలక్ట్రిక్ రైస్‌ కుక్కర్‌ జగన్ ముఖంపై బోర్లించి శ్వాస ఆడకుండా చేశాడు. దేవిక అతని వృషణాలను మెలితిప్పింది. జగన్‌.. బెనర్జీని వదిలించుకోవడంతో దేవిక హిట్‌ను అతని ముఖంపై కొట్టింది. దీంతో జగన్ కిందపడ్డాడు.

 తల్లి ఏం చెప్పవద్దని చెప్పిందని,

తల్లి ఏం చెప్పవద్దని చెప్పిందని,

జగన్‌కు ఊపిరి ఆడకుండా చేసే సమయంలో అతనిపై బెనర్జీ గోరుగాట్లు పడ్డాయి. ఆ తర్వాత దేవిక... బెనర్జీని అక్కడి నుంచి పంపి, హత్యను తన పైన వేసుకుంది. పక్కనే ఉన్న బీరుసీసాతో తన చేతిపై గాయం చేసుకుంది. హిట్‌ను తలపై కొట్టుకుంది. హిట్‌ను తనపై కొట్టుకుంది. బెనర్జీ వెళ్తున్న సమయంలో ఇంటి యజమాని లేచాడు. అదే సమయంలో పిల్లలు కూడా చూశారు. ఏం చెప్పవద్దని పిల్లలకు తల్లి దేవిక చెప్పింది. తల్లి ఏం చెప్పవద్దని అన్నదని ఓ కూతురు చెప్పడంతో పోలీసులకు అనుమానం కలిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+