మద్యం తాగించి మహిళపై రేప్, ఆ తర్వాత హత్యాయత్నం: వివాహిత ఆత్మహత్య
సంగారెడ్డి/ ఆదిలాబాద్: ఓ దుర్మార్గుడు మద్యం తాగించి, ఓ మహిళపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను మెదక్ జిల్లా జోగిపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో డిఎస్పీ రాజరత్నం వెల్లడించారు.
ఈ నెల 4వ తేదీన టెక్మాల్ మండలం తంపులూరు గ్రామానికి చెందిన మహిళ తన బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి పెద్దశంకరంపేట మండలం ఉత్తులూరు వెళ్లింది. ఈ నెల 5వ తేదీన ఆమెను అక్కడే తనకు బంధువైన ఎడ్ల యాకోబ్ అలియాస్ పెంటయ్య కలిశాడు.
ఆమెను నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకుని వెళ్లి మద్యం తాగించి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను తీవ్రంగా హింసించాడు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఆమె కాళ్లకు ఉన్న వెండి కడియాలను తీసుకుని పరారయ్యాడు.

కొద్దిసేపటికి తేరుకున్న ఆమె తన బంధువు సాయంతో పెద్దశంకరంపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలిచారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది.
ఈ కేసులో విచారణ జరిపి పోలీసులు నిందితుడు యాకోబ్‌ను ఉత్తలూరులో మంగళవారంనాడు అదుపులోకి తీసుకుని జోగిపేట మున్సిఫ్ కోర్టుకు రిమాండ్ చేశారు. నిందితుడిపై రౌడీ షీట్ తెరుస్తున్నట్లు రాజరత్నం చెప్పారు.
ఇదిలావుంటే, ఆదిలాబాద్ జిల్లాలో విషాద సంఘటన జరిగింది. జీవితంపై విరక్తి చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండలం తుమ్మగూడెం తండాకు చెందిన బానోతు గోపాల్ భార్య మీనాక్షి (22) రెండు నెలల క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
అయితే, పసికందు కొద్దిరోజులకే మరణించాడు. దాంతో మీనాక్షి తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ నేపథ్యంలో మంగళవారంనాడు ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని మరణించింది.












Click it and Unblock the Notifications