మహిళను చంపిన చైన్ స్నాచర్: దారుణ హత్య
హైదరాబాద్: మహిళలపై దొంగల ఆగడాలు హైదరాబాదు నగరంలో పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాదులోని చైతన్యపురి మారుతీనగర్‌లో ఓ దుండగుడు ఓ మహిళపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె మరణించింది. గురువారంనాడు ఈ సంఘటన జరిగింది.
మహిళ మెడ నుంచి గొలుసును లాక్కునేందుకు అతను ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో అతను కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన మహిళ చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాదులోని జవహర్‌నగర్ అంబేడ్కర్ కాలానీలో బుధవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు బండరాయితో తలపై మోది అతన్ని హత్య చేశారు. స్థానికంగా ఉండే నల్ల రామచందర్ (45) అనే వ్యక్తి పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.
బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను బండరాయితో మోదారు. దాంతో అతను మరణించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు కారణాలు తెలియరాలేదు.
మెదక్ జిల్లా కొండపాక శివారులో రాజీవ్ రహదారిపై స్కూటర్ మీద వెళ్తున్న దంపతులను పోలీసు జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య మరణించగా, తీవ్రంగా గాయపడిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.












Click it and Unblock the Notifications