హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీ యువతిని గన్‌తో బెదిరించి, ఆధారాలు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏటీఎం నుంచి నగదు తీసుకునేందుకు వచ్చిన యువతిని ఓ అగంతకుడు తుపాకీతో బెదిరించి ఆమె నగరు, ఏటీఎం కార్డు, సెల్ ఫోన్ దోచుకొని పరారయ్యాడు. హైదరాబాదులోని యూసఫ్ గూడ రహదారిలో బుధవారం ఈ ఘటన జరిగింది.

తూర్పూ గోదావరి జిల్లా తాటిపాకకు చెందిన శ్రీలలత (24) బుధవారం ఉధయం ఏడున్నకు స్టేట్ హోం - యూసుఫ్ గూడ దారిలోని ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లింది. నగదు తీసుకునేందుకు ప్రయత్నించగా కేవలం రశీదు మాత్రమే వచ్చింది. ఇంతలో ముఖానికి కర్చీఫ్ ధరించిన అగంతకుడు లోపలకు వచ్చాడు.

కుడిచేతితో తుపాకీ పట్టుకొని యువతిని బెదిరించాడు. తాను మంచివాడినని, ఏమీ చేయనని, డబ్బు మాత్రం కావాలన్నాడు. చేతిలో ఉన్నది డమ్మీ తుపాకీ కాదని బెదిరించాడు. రెండు ఏటీఎంల మధ్యలోకి ఓ రౌండ్ పేల్చాడు. భయపడిన యువతి నుండి ఏటీఎం కార్డ్ లాక్కున్నాడు.

పాస్ వర్డ్ అడిగి అందులో కొంత మొత్తం ఉన్నట్లు గుర్తించాడు. అనంతరం శ్రీలలిత మెడలోని బంగారు గొలుసు, చెవి దుద్దులు, చేతి ఉంగరాలు, సెల్ ఫోన్, పౌచ్ లాక్కున్నాడు. అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. బయట మరో మనిషి ఉన్నాడని చెప్పాడు. తాను వెళ్లిన పది నిమిషాలకు బయటకు రావాలని హెచ్చరించాడు. కొద్ది సేపటికి మైత్రివనం చౌరస్తాలో ఉన్న పోలీసు పెట్రోలింగ్ వాహనం వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

విచారణను వేగవంతం చేశామని వెస్ట్ జోన్ డీసీపీ గురువారం సాయంత్రం చెప్పారు. ఆరు బృందాలతో విచారణ జరిపిస్తున్నామన్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేస్తున్నామన్నారు. నిందితుడుకి సంబంధించి చాలా అధారాలు లభించాయని చెప్పారు.

 ఏటీఎంలో యువతి నుండి చోరీ

ఏటీఎంలో యువతి నుండి చోరీ

అతను నాటు తుపాకీతో ఆమెను బెదిరించి ఆమె ఒంటిపైగల బంగారు ఆభరణాలను, ఏటీఎం కార్డును, స్మార్ట్‌ఫోన్‌ను లాక్కున్నాడు. తన చేతిలో ఉన్నది నిజమైన తుపాకీయే అని నిరూపించడానికి గోడపై బుల్లెట్‌ పేల్చి మరీ చూపాడు. నగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.

ఏటీఎంలో యువతి నుండి చోరీ

ఏటీఎంలో యువతి నుండి చోరీ

తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాక గ్రామానికి చెందిన చింతా శ్రీలలిత ఏడాదిన్నరగా హైదరాబాద్‌లోని మధురానగర్‌లో ఒక మహిళా హాస్టల్‌లో ఉంటోంది. బేగంపేటలోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది.
 ఏటీఎంలో యువతి నుండి చోరీ

ఏటీఎంలో యువతి నుండి చోరీ

బుధవారం ఉదయం విధులకు వెళ్లడానికి హాస్టల్‌ నుంచి బయలుదేరిన ఆమె యూసు్‌ఫగూడలోని స్టేట్‌హోం ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నించగా అది పని చేయలేదు. ఇంతలో ముఖానికి కర్చీఫ్‌ కట్టుకున్న ఓ దుండగుడు ఆ ఏటీఎంలోకి వెళ్లాడు. తన చేతిలోని నాటు తుపాకీని ఆమెకు గురిపెట్టాడు.

ఏటీఎంలో యువతి నుండి చోరీ

ఏటీఎంలో యువతి నుండి చోరీ


నిన్నేం చేయనని, తనకు డబ్బులు కావాలని, ఇస్తే వెళ్లిపోతానని తెలుగులో చెప్పాడు. దీనికి ఆమె ప్రతిఘటించింది. ది మా మూలు తుపాకీ కాదని, కేకలు వేయవద్దని, ఏం జరుగుతుందో చూడని చెప్పి రెండు ఏటీఎం యం త్రాల మధ్య గల గోడపై ఒకసారి కాల్చాడు. భయంతో వణికిపోతున్న లలిత మెడలోని బంగారు గొలుసును, ఇయర్‌ రింగ్స్‌, ఉంగరంతోపాటు ఏటీఎం కార్డును, సామ్‌సంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను, పర్సును లాక్కున్నాడు. ఏటీఎం పిన్‌ నంబర్‌ అడిగి సెల్‌ఫోన్‌లో నోట్‌ చేసుకున్నాడు.

 ఏటీఎంలో యువతి నుండి చోరీ

ఏటీఎంలో యువతి నుండి చోరీ


తర్వాత తన అనుచరులు బయట ఉన్నారని, వెంటనే వస్తే వారు కాల్చేస్తారని చెప్పాడు. పది నిముషాలు ఆగిన తర్వాత బయటకు రమ్మని చెప్పి వెళ్లిపోయాడు. బయటకు రాగానే అటూఇటూ చూసుకుని వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశాడు.

ఏటీఎంలో యువతి నుండి చోరీ

ఏటీఎంలో యువతి నుండి చోరీ

అనంతరం ఆమె పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దుండగుడి ఆచూకీ కోసం రప్పించిన డాగ్‌ స్క్వాడ్‌ ఊడిపి హోటల్‌ వరకు వెళ్లి ఆగిపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏటీఎంలో యువతి నుండి చోరీ

ఏటీఎంలో యువతి నుండి చోరీ


దుండగుడి కోసం మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కాగా, ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో తెలుసుకున్న పోలీసులు యూసు్‌ఫగూడ ఎస్‌బీఐ శాఖ కార్యాలయానికి వెళ్లి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు.

ఏటీఎంలో యువతి నుండి చోరీ

ఏటీఎంలో యువతి నుండి చోరీ

లలిత నుంచి వస్తువులు, ఏటీఎం కార్డు లాక్కుపోయిన దుండగుడు సారథి స్టూడియో వెనుక ఉన్న ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినట్టు గుర్తించారు.

 ఏటీఎంలో యువతి నుండి చోరీ

ఏటీఎంలో యువతి నుండి చోరీ

తన ఖాతాలో మూడువేల అయిదు వందల రూపాయలు నిల్వ ఉందని, ఆ మొత్తాన్నీ అతడు డ్రా చేశాడని లలిత తెలిపింది.

 ఏటీఎంలో యువతి నుండి చోరీ

ఏటీఎంలో యువతి నుండి చోరీ

ఈ ఘటన గురించి తెలుసుకున్న జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. దుండగుడు బీహార్‌కు చెందినవాడుగా భావించినప్పటికీ తెలుగులో స్పష్టంగా మాట్లాడాడని తెలియడంతో స్థానికుడుగా అనుమానిస్తున్నారు.

English summary
Woman techie robbed of money, jewellery at Hyderabad ATM
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X