కసాయి తల్లి: ఆడపిల్ల పుట్టిందని మురికికాల్వలో పారేసింది, పీక్కుతిన్న పందులు!
నల్గొండ: తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా దేవరకొండలో దారుణం జరిగింది. ఆడపిల్ల పుట్టిందని ఓ తల్లి పసిబిడ్డను డ్రెయినేజీలో పడేసిన సంఘటన సోమవారం నాడు స్థానికంగా సంచలనం సృష్టించింది.
దేవరకొండలో ఓ మహిళకు ఆడపిల్ల జన్మించింది. ఆడపిల్ల పుట్టడంతో కసాయి తల్లి ఆ పసిగుడ్డును మురికి కాలువలో పడేసింది. పసిగుడ్డును పందులు పీక్కు తింటుండగా స్థానికులు గమనించారు. వెంటనే రక్షించే ప్రయత్నం చేశారు.

వివాహిత ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా జగిత్యాలలో కుటుంబ కలహాలత ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. జగిత్యాలలోని విద్యానగర్‌కు చెందిన శ్రీనివాస్‌కు జాఫ్తాపురం గ్రామానికి చెందిన సుధారాణితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
శ్రీనివాస్ ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడు. సుధారాణి స్థానికంగా ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. అత్తామామలతో కలిసి ఉంటోంది. కొన్ని రోజులుగా కుటుంబంలో తగాదాలు జరుగుతున్నాయి. దీంతో ఆదివారం రాత్రి సుధారాణి ఉరేసుకుంది.












Click it and Unblock the Notifications