మత్తు మందులో ముంచి...! అక్రమ సంబంధం అంటగట్టి...!

ఆడదానికి ఆడదే శత్రువంటారు .నిజామాబాద్ జిల్లాలో అదే జరిగింది. స్వంత వదిననే సినిఫక్కిలో మాయా చేసి వేధింపులకు గురిచేసింది. తన కటుంభ సభ్యురాలు అనికూడ చూడకూండ బయటి వ్యక్తితో అసభ్యకర ఫోటోలు తీయించింది. అనంతరం వేధింపులకు గురి చేసి తన ఇంటి నుండి పంపించి వేసింది.వదిన కక్ష పెంచుకున్న మరదలు..
సిరియల్స్ ప్రభావమో మరి ఆధునిక పోకడలో తెలియదు కాని తన స్వంత అన్న భార్యనే ఏమార్చింది. వరుసకు వదిన కావడంతో పాటు సాటీ మహిళ అని కూడ చూడకుండా వ్యవహరించింది. చివరకు వదినను అబాసు పాలు చేసి రాక్షస ఆనందాన్నిపోందింది. నిజం తెలియడంతో కటకటాలా పాలైయ్యోందుకు సిద్దంగా ఉంది.

women has got harassment by her sister in-law

వదినా మరదళ్ల మధ్య వివాదం

నిజామాబాద్ జిల్లాలోని ఇద్దరు స్వంత వదిన మరదలు అవుతారు. అయితే ఆ ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో మరదలు వదినపై ద్వేషం పెంచుకుంది. ఆమేపై ఎలాగైన కక్ష తీర్చుకోవాలని భావించింది. ఆలోచించిందే తడవుగా మంచిగా మాట్లాడి వదినకు కూల్ ఢ్రింక్స్‌లో మత్తు మందు కలిపి ఇచ్చింది .వదిన స్పృహకోల్పాయాక దారుణానికి పాల్పడింది
వదినకు కూల్‌డ్రిక్స్ లో మత్తుమందు

మత్తులో ఉన్న వదినపై వేరే యువకుడితో ఉన్నట్టు సినిమా ఫక్కిలో అశ్లీల పోటోలు తీసింది. అనుకున్నది సాధించడంతో ,ఆ ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించింది. దీంతో వదిన ఏం జరిగిందో అర్ధం కాక మానసికంగా ఇబ్బందులకు గురైయింది. మరోవైపు ఫోటోలకు ఫోజులు ఇచ్చిన యువకుడికి సైతం ఇదే అదనుగా ఆమేను వేధించడం ప్రారంభించాడు. తన కోరిక తీర్చాలంటూ వెంటపడ్డాడు. దీంతో విషయం భర్తకు కూడ తెలియడంతో వారిద్దరి మధ్యలో ఘర్షన ప్రారంభమైంది.

పుట్టింటికి వెళ్లిన ఆగని లైంగిక వేధింపులు

దీంతో బాధితురాలు పుట్టింటికి వెళ్లింది. అయితే అక్కడి కూడ వారి వేధింపులకు ఫుల్‌స్టాప్ కాలేదు. యువకుడు అక్కడికి వెళ్లి వేధించసాగాడు దీంతో భాదితురాలు తన కుటుంభ సభ్యల సహకారంతో ఆ యువకున్ని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించి జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా
యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు బాధితురాలి ఫిర్యాదు ప్రకారం విచారణ చేపట్టారు. విచారణ లో మరదలి హస్తం ఉందని తేలితే ఆమేను కూడ కటకటాల వెనక్కి నెట్టనున్నట్టు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+