Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జీతం డబ్బుల కోసం .. యజమాని నోట్లో గుడ్డలుకుక్కి, ఇనుపరాడ్ తో వర్కర్ దాడి; ఓనర్ మృతి

జీతం డబ్బుల కోసం యజమానిని ఒక వర్కర్ హత్యచేసిన దారుణ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీతం డబ్బుల విషయంలో యజమాని గొడవకు దిగడంతో విచక్షణ కోల్పోయిన వర్కర్ యజమానిపై ఇనుప రాడ్ తో దాడి చేశాడు. యజమాని అరుపులు బయటకు వినపడకుండా నోట్లో గుడ్డలు కుక్కి మరీ పలుమార్లు ఇనుప రాడ్ తో దాడి చేసి హతమార్చాడు. ఆపై అక్కడి నుండి పరారయ్యాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ కేసు వివరాల్లోకి వెళితే

బైక్ మెకానిక్ షాప్ నడుపుతున్న వీరేందర్ కుమార్ సేత్

బైక్ మెకానిక్ షాప్ నడుపుతున్న వీరేందర్ కుమార్ సేత్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 55 సంవత్సరాల వీరేందర్ కుమార్ సేత్ భార్య పిల్లలతో కలిసి 30 ఏళ్ళ క్రితం నగరానికి వలస వచ్చారు. చింతల్ కల్పన సొసైటీలో ఉంటున్న వీరేందర్ కుమార్ సేత్ గత ఏడేళ్ల క్రితం చింతల్ గణేష్ నగర్ బస్టాండ్ పక్క సందులో బైక్ మెకానిక్ షాప్ నిర్వహిస్తున్నాడు. వీరేందర్ వద్ద ఇద్దరు వర్కర్లు పని చేస్తున్నారు. ఇటీవల మరో వర్కర్ 26 సంవత్సరాల సయ్యద్ జహీర్ గాజులరామారం రోడా మేస్త్రి నగర్ కు చెందిన వ్యక్తి పనిలో చేరాడు. మొత్తం ముగ్గురు వర్కర్లు వీరేందర్ కుమార్ సేత్ వద్ద పని చేస్తున్నారు.

జీతం డబ్బుల కోసం యజమానితో గొడవ .. ఇనుప రాడ్ తో కొట్టి చంపిన వర్కర్

జీతం డబ్బుల కోసం యజమానితో గొడవ .. ఇనుప రాడ్ తో కొట్టి చంపిన వర్కర్

అయితే ఇటీవల ఇద్దరు యువకులు సెలవుల్లో ఉండగా, గురువారం రోజు షాపులో వీరేందర్, జహీర్ ఇద్దరే ఉన్నారు. గురువారం రోజు రాత్రి 10 గంటల సమయంలో వీరేందర్ మద్యం సేవిస్తున్న సమయంలో జహీర్, జీతం డబ్బులు ఇవ్వాలని వీరేందర్ ను అడిగారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో విద్యుత్ ను కోల్పోయిన జహీర్ వీరందర్ ను ఇనుప రాడ్ తో బలంగా కొట్టాడు. నోట్లో గుడ్డలు కుక్కి మరీ ఇనుప రాడ్ తో దాడి చేసి వీరేందర్ ను చంపి పరారయ్యాడు.

సిసిటివి ఫుటేజీ ఆధారంగా నిందితుడు జహీర్ ను పట్టుకున్న పోలీసులు

సిసిటివి ఫుటేజీ ఆధారంగా నిందితుడు జహీర్ ను పట్టుకున్న పోలీసులు

ఆ తర్వాత బైక్ రిపేర్ కి ఇచ్చిన వ్యక్తి మెకానిక్ షాప్ కి రాగా అక్కడ రక్తపుమడుగులో పడివున్న మెకానిక్ వీరేందర్ ను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, అక్కడకు చేరుకున్న పోలీసులు వీరేందర్ మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య హేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజీ ఆధారంగా నిందితుడు జహీర్ ను పోలీసులు గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

Recommended Video

    ప్రవాస భారతీయుల కోసం కొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తున్న దేవేందర్ రెడ్డి || Oneindia Telugu
    యజమానిని దారుణంగా హతమార్చిన వర్కర్ జహీర్ కటకటాలపాలు

    యజమానిని దారుణంగా హతమార్చిన వర్కర్ జహీర్ కటకటాలపాలు

    పట్టుమని నెల రోజులైనా పని చేయక ముందే యజమానిని దారుణంగా హతమార్చిన వర్కర్ జహీర్ ఇప్పుడు కటకటాలపాలయ్యాడు. జహీర్ చేసిన పనికి వీరేందర్ కుమార్ సేత్ కుటుంబం ఇప్పుడు కుటుంబ పెద్దను కోల్పోయింది. ఇటీవల కాలంలో క్షణికావేశంలో మనుషుల ప్రాణాలు తీయటం సర్వ సాధారణం అయిపోయింది.

    చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీస్తున్న వారి తీరు సమాజానికి ఆందోళనకరంగా తయారయ్యింది. ఇలాంటి ఘటనలతో ప్రజల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతుంది. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసే ఇలాంటి పరిస్థితులు మారాలంటే ఏం చెయ్యాలన్నది ప్రస్తుతం అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+