మాతో పని చేస్తారనుకుంటున్నాం: కెసిఆర్‌కు ప్రపంచ ఆర్థిక సదస్సు లేఖ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం లేఖ రాసింది. ఇటీవలి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నందుకు ఆయనకు ధన్యావాదాలు తెలిపింది.
తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి కోసం రూపొందించిన ప్రణాళికను తెలుసుకున్నామని అందులో పేర్కొంది. భవిష్యత్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పని చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
కాగా, సెప్టెంబర్ 9న కెసిఆర్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రసంగించారు. భారత్ పెట్టుబడులకు స్వర్గధామం అని, చైనా మార్కెట్ల గురించి ఆందోళన అవసరం లేదని, ఇలాంటి ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ చైనా నిలదొక్కుకుంటుందని చెప్పారు.
భారత్‌లో ఫెడరల్ వ్యవస్థ గొప్పగా పని చేస్తోందని, దేశ అభివృద్ధిలో రాష్ట్రాలది కీలక పాత్ర అన్నారు. భారత దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని, అభివృద్ధిలో నూతన శిఖరాలను అధిరోహించాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు. కెసిఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు.

ఆత్మహత్యలు వద్దు: పోచరం
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. రుణరహిత రైతులను సాధించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసమే రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.
శాసన మండలిలో రైతు ఆత్మహత్యలు, సమస్యలపై చర్చ సందర్బంగా మాట్లాడారు. ఒక సెంటుభూమి కూడా మునగకుండా కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టును నిర్మిస్తామన్నారు. ఐదు వేల ఎకరాలకు ఒకరు చొప్పున ఏఈవోలను నియమిస్తామన్నారు.
అదనంగా వెయ్యి ఏఈవో పోస్టులను సృష్టించామన్నారు. త్వరలో ఏఈవోల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. రేపటి నుంచి మొబైల్ వెటర్నరీ వ్యాన్‌లను ఊళ్లలో నడుపుతామన్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా రద్దు బదిలీని అమలు చేస్తామని, సాధ్యమైనంత త్వరలో రైతు రుణమాఫీని పూర్తి చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications