బహు రుచులు: హైదరాబాదులో వరల్డ్ స్వీట్ ఫెస్టివల్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం యేటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ పతంగుల పర్వదినానికి అనుబంధంగా వరల్డ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ను నిర్వహించనుంది. ఆ స్వీట్ ఫెస్టివల్‌కు హైదరాబాద్‌ వేదిక అవుతోంది.

అందుకుగాను తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అధ్యక్షతన వివిధ రాష్ట్రాల సాంస్కృతిక సంఘాల ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.

హైదరాబాద్‌లో నివసించే వివిధ రాష్ట్రాల, దేశాల ప్రజల ఆహారపు అలవాట్లను ప్రతిబింబించే వేదికగా ఈ అంతర్జాతీయ స్వీట్‌ ఫెస్టివల్‌ను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

World sweet festival will be held in Hyderabad

వివిధ రాష్ట్రాలకు చెందిన స్వీట్లను ఒకే వేదికపై ప్రదర్శించడం వల్ల ప్రజల మధ్య సాన్నిహిత్యం, పరస్పర గౌరవం పెరుగుతాయని బుర్రా వెంకటేశం అన్నారు. జనవరి 13 నుంచి 15 వ తేదీ వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో నిర్వహిస్తారు.

దాదాపు లక్ష మంది ఈ ఫెస్టివల్‌కు హాజరవుతారని భావిస్తున్నారు.ఈ ఫెస్టివల్‌కు సంబంధించి ఓ కార్యాచరణను రూపొందించడానికి ఓ కమిటీ ఏర్పాటైంది. వెంకటేశం నేతృత్వంలోని కమిటీలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, బెంజెమెన్‌లు సభ్యులుగా ఉన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Government will organise World Sweet Fesival during Makara sankanti.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి