అడెల్లి పోచమ్మ ఆలయంలో అపచారం: గర్భగుడిలో మద్యం సీసాలు, పూజలు
గ్రామ దేవతలను ఆయా సామాజిక వర్గాలకు చెందినవారు కొలుస్తారు. నిష్టగా పూజలు చేస్తుంటారు. అయితే గర్భగుడిలో చక్కగా ఉండి.. పూజలు చేయాలి.. కానీ కొందరు అన్నీ మరచిపోతున్నారు. అవును.. ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తున్నారు. అడెల్లి మహా పోచమ్మ క్షేత్రంలో ఇలాంటి జరిగింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. పోలీసులు కూడా చర్యలు తీసుకున్నారు.
పోచమ్మ గర్భగుడిలో కొందరు మద్యం సీసాలు పెట్టి.. పూజలు చేశారు. ఫొటోలు దిగి స్టేటస్ పెట్టుకున్నారు. ఈ నెల 8వ తేదీన ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొందరు అమ్మవారి గర్భగుడిలో ప్రవేశించారు. అమ్మవారి చెంత మద్యం బాటిళ్లు ఉంచి పూజలు చేశారు. అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. షేర్ చేయడంతో ఇప్పుడు అవి వైరల్ అయ్యాయి.

గర్భగుడిలో మద్యం సీసాలు పెట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర విమర్శలు రావడంతో అధికారులు చర్యలు తీసుకోక తప్పలేదు. ఓ ఉద్యోగిని చర్యలకు ఉప్రకమించారు. అతనిని సస్పెండ్ చేయడంతోపాటు మరో ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగించే చర్యలకు దిగితే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు.
గ్రామ దేవతలు అంటే.. అన్నీ సామాజిక వర్గాలు కొలుస్తారు. పూజలు చేసి.. అమ్మవారి ఆశీస్సులను తీసుకుంటారు. స్థానికంగా దేవతలు చాలా పవర్ ఫుల్ అని స్థానికులు చెబుతారు. కానీ అలాంటి ప్రముఖ ఆలయంలో.. మద్యం సీసాలు హల్ చల్ చేశాయి.












Click it and Unblock the Notifications