16 ఎంపీలతో కేసీఆర్ పీఎం అవుతారా ? అమిత్ షా

16 ఎంపీ సీట్లతో తెలంగాణ సీఎం కేసీఆర్ పీఎం అవుతారా అంటూ బాజపా అధ్యక్షుడు అమిత్ షా ఎద్దేవా చేశాడు, చేవేళ్ల బీజేపి అభ్యర్థి జనార్థన్ రెడ్డి కి మద్దతుగా ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా పాల్గోని ప్రసంగించారు. ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పై పలు విమర్శలు చేశారు. ఎంఐఎం అధినేత ఓవైసీకి సీఎం కేసీఆర్ భయపడుతున్నాడని అన్నారు. లేదంటే తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించే ధైర్యం కేసీఆర్ కు ఉందా అని ప్రశ్నించాడు.

ఈ సంధర్భంలోనే తెలంగాణలో 16 సీట్లు గెలిపించాలని సీఎం ప్రచారం చేస్తున్నారని ,అవి గెలిస్తే ఆయన పిఎం అవుతారా అంటూ ఎద్దెవా చేశారు.మరోవైపు పూర్తి మెజారీటితో అసెంబ్లి ఎన్నికల్లో గెలిచినా కూడ రెండు నెలల వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారని అమిత్ షా విమర్శించారు. నేడు ప్రచారం చివరి రోజు కావడంతో ఆయన కార్యకర్తలను ఉత్సహపరుస్తూ తన ప్రసంగం కొనసాగించారు. తెలంగాణ అభివృద్ది బీజేపీతోనే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ది బీజేపీతోనే సాధ్యమని అన్నారు.

would cm kcr become pm with 16 mp seats ? amit shah

ఇక దేశం మొత్తం గర్విస్తున్న సర్జికల్ స్ట్రైక్ దాడులను కాంగ్రెస్ పార్టీ చులకన చేసీ మాట్లాడుతుందని మండిపడ్డారు. దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ప్రజలు నరేంద్రమోడి మరోసారి ప్రధాన మంత్రి కావాలని చూస్తున్నారని షా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+