1969 ఉద్యమంలో జైలుకెళ్లిన, రచయిత జంగయ్య కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ కవి బోయ జంగయ్య శనివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన స్వగ్రామమైన నల్గొండ జిల్లా పంతంగిలో సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు సంతాపం తెలిపారు.
బోయ జంగయ్య (80) 1969 తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లాడు. కొంతకాలంగా ఆయన పక్షవాతం కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వనస్థలిపురంలోని తన కుమారుడి నివాసంలో శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు.

నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ వాసి అయిన జంగయ్య నల్గొండ పట్టణంలోని మాన్యంచెల్కలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జాతర, జగడంతోపాటు పుట్టుముచ్చ పేరుతో ప్రత్యేక నవలలే కాకుండా దున్న, చీమలు, తుపాకులు, బోజ కథలు పేరుతో అనేక కథా సంపుటులు వెలువరించారు.
జాతర నవలకుగాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 1969 తెలంగాణ ఉద్యమంలో జంగయ్య జైలుశిక్ష అనుభవించారు. 2014లో వేముల ఎల్లయ్య సంపాదకత్వంలో బోయ జంగయ్య ఆత్మకథ అవసరం వెలువడింది.












Click it and Unblock the Notifications