రెండోసారి లేఖ విసిరాడు: కోర్టు వద్ద మళ్లీ యాసిన్ భత్కల్ హల్‌చల్

హైదరాబాద్: దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ మంగళవారం నాడు మరోసారి కోర్టు ప్రాంగణంలో హల్ చల్ సృష్టించాడు. ఈ రోజు భత్కల్ సహా ఐదుగురిని పోలీసులు రంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో హాజరుపరిచారు.

Yasin Bhatkal throws out letter at court

ఈ సమయంలో యాసిన్ భత్కల్ కోర్టు ఆవరణలో లేఖ విసిరాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ లేఖను స్వాధీనం చేసుకున్నారు. లేఖలో ఏం రాశాడన్నది తెలియరాలేదు. ప్రస్తుతం ఆ లేఖ పోలీసుల వద్ద ఉంది.

ఇండియన్ ముజాహిదీన్ సంస్థ సహ వ్యవస్థాపకుడు అయిన భత్కల్ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాడనే విషయమై తెలియాల్సి ఉంది. కాగా, యాసిన్ భత్కల్‌ను జైలు నుంచి తప్పించేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పెద్ద కుట్ర చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Yasin Bhatkal throws out letter at court

యాసిన్ భత్కల్‌ను జూలై 9వ తేదీన రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద హంగామా చేశాడు. అతను ఆ రోజు గులాబీ పువ్వుతో హాజరయ్యాడు. జడ్జి ఎధుట గులాబీతో హాజరై అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతకుముందు జూలై 7వ తేదీన భత్కల్ లేఖ విసిరాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+