వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

year ender 2022: మునుగోడులో మొనగాడుగా గులాబీపార్టీ.. అయినా కేసీఆర్ కు హెచ్చరికే!!

|
Google Oneindia TeluguNews

2022 సంవత్సరం తెలంగాణాలోని రాజకీయ పార్టీలకు మునుగోడు ఉపఎన్నిక లిట్మస్ టెస్ట్ లా అయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార ప్రతిపక్ష పార్టీలకు మునుగోడు ఉపఎన్నిక వచ్చే ఎన్నికలకు సెమీ ఫైనల్ గా మారింది. ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలిస్తే, వారికి వచ్చే ఎన్నికల్లో పట్టు ఉంటుందని అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీగా తలపడేలా చేసింది.

తెలంగాణాలో హాట్ టాపిక్ అయిన మునుగోడు ఉప ఎన్నిక

తెలంగాణాలో హాట్ టాపిక్ అయిన మునుగోడు ఉప ఎన్నిక

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగగా, టిఆర్ఎస్ పార్టీ నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాక ముందు నుండే అన్ని రాజకీయ పార్టీలు మునుగోడులో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి. మునుగోడు ఓటర్లను ఓ రేంజ్లో ప్రలోభ పెట్టాయి. ఒకరిని మించి ఒకరు వ్యూహాత్మక ఎత్తుగడలతో మునుగోడు స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం పోటీ పడ్డారు. మునుగోడు కేంద్రంగా జరిగిన సమరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు కారణమైంది.

హోరాహోరీ పోరు.. విజయం సాధించిన గులాబీ పార్టీ

హోరాహోరీ పోరు.. విజయం సాధించిన గులాబీ పార్టీ

మునుగోడు లో గెలిచి టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బిజెపిని చూపించాలని కమలనాథులు ప్రయత్నం చేశారు. జాతీయ నాయకులను రంగంలోకి దింపి ప్రచారం చేశారు. ఇక మునుగోడులో బలంగా తలపడుతున్న బిజెపి ని ఎదుర్కోవడం కోసం గులాబీ అధినేత కెసిఆర్ రాష్ట్రంలోని మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను వంద మందికిపైగా రంగంలోకి దింపి మునుగోడు నియోజకవర్గం లో ప్రచార పర్వాన్ని సాగించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరు అప్పజెప్పి ప్రచారం చేశారు. తాను స్వయంగా ఒక ఊరికి ఇంచార్జ్ గా ఉన్నారు. హోరాహోరీ పోరాటంలో మునుగోడు స్థానాన్ని కెసిఆర్ పార్టీ కైవసం చేసుకుంది. 11 వేల ఓట్ల మెజార్టీతో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.

మునుగోడులో గెలిచినా కేసీఆర్ కు హెచ్చరికగా నిలిచిన ఫలితం

మునుగోడులో గెలిచినా కేసీఆర్ కు హెచ్చరికగా నిలిచిన ఫలితం

అధికార టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇచ్చి హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతుందని భావించిన బిజెపి మునుగోడులో ఓటమిపాలైంది. కానీ ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ రికార్డు ప్రదర్శన చూపించింది. గతంలో ఎప్పుడూ మునుగోడులో బీజేపీకి ఇంత ఓట్ల శాతం రాలేదు. 2018 ఎన్నికల్లో బిజెపి కేవలం పన్నెండు వేల ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తే మునుగోడు లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఈ దఫా 85 వేలకు పైగా ఓట్లు సాధించి తన సత్తా చాటింది. తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ పార్టీ మునుగోడులో గెలిచినప్పటికీ గులాబి బాస్ కు వచ్చిన ఫలితం షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇంతమంది హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేస్తే కేవలం 11 వేల ఓట్లతో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం కెసిఆర్ ను ఆలోచించేలా చేసింది.

గులాబీ అధినేతలో టెన్షన్.. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం

గులాబీ అధినేతలో టెన్షన్.. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం

మునుగోడులో గెలిచిన కేసీఆర్ పార్టీకి డేంజర్ బెల్స్ మోగినట్టు గా ఆ పార్టీ గుర్తించింది. సహజంగా ఉపఎన్నిక ఏ రాష్ట్రంలో జరిగినా అది అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా ఉంటుంది. కానీ మునుగోడులో మాత్రం సీఎం కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం చాలా పెద్ద ఎత్తున కష్టపడాల్సి వచ్చింది. కెసిఆర్ పార్టీకి దక్కవలసిన విజయం అతి కష్టంగా దక్కింది. దీంతో కెసిఆర్ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పని చేయాలని సూచించారు.

మునుగోడులో ఓడినా ప్రజా క్షేత్రంలో దూకుడుగా బీజేపీ

మునుగోడులో ఓడినా ప్రజా క్షేత్రంలో దూకుడుగా బీజేపీ


ఇక మునుగోడులో ఓటమిపాలైన ప్పటికీ, బలం పుంజుకున్నామని భావించిన బిజెపి, మునుగోడు ఓటమికి వెనకడుగు వేయకుండా కెసిఆర్ పై పోరాటంలో ముందు అడుగు వేస్తూ ముందుకు సాగుతోంది. దెబ్బ తిన్న పులిలా దూకుడుగా సాగుతుంది. మునుగోడులో నైతిక విజయం తమదేనని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు మునుగోడు ఉప ఎన్నిక ఫలితం భవిష్యత్తు ఎన్నికల్లో రిపీట్ అయ్యే ప్రసక్తే లేదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక మునుగోడులో కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఉనికి చాటుకోవటం కోసం కాంగ్రెస్ కష్టాలు పడాల్సి వస్తుంది.

English summary
Munugode by-election is crucial for all political parties in Telangana in 2022, KCR's party won in Munugode. However, the result of the munugode by-election has warned KCR about future elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X