దారుణం: మెమోరీ కార్డు కోసం తండ్రిని చంపిన కొడుకు
మహబూబ్‌నగర్: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సెల్‌ఫోన్‌లో ఉండే మెమోరీకార్డు కోసం కన్నతండ్రిని కుమారుడే అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన వీపనగండ్ల మండలంలోని సంగినేనిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సంగినేనిపల్లికి చెందిన గోవుల హన్మంతు(48), శాంతమ్మలకు ఇద్దరు కుమారులు. వారు కూలీ పని చేసుకొని జీవిస్తున్నారు. సోమవారం రాత్రి పెద్ద కుమారుడు రాజు మద్యం సేవించి మెమోరీకార్డు కోసం తండ్రితో ఘర్షణ పడ్డాడు.

రాజు తన మెమోరీకార్డు ఇవ్వాలని గట్టిగా అడిగినా తండ్రి ఇవ్వకపోవడంతో రాత్రి నిద్రపోయిన తర్వాత హన్మంతుపై కర్రతో దాడి చేసి, బండరాయితో తలపై మోది చంపేశాడు. సంఘటనా స్థలాన్ని మంగళవారం ఉదయం ఎస్సై రవిబాబు పరిశీలించి వివరాలు సేకరించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని కన్నాల ఫ్లెవర్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందారు. డీసీఎం డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. తీవ్రగాయాలపాలైన ఇతడ్ని బయటికి తీసిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications