రన్నింగ్ ట్రైన్ నుంచి దూకాడు, యువతుల అశ్లీల డ్యాన్స్‌తో ఇబ్బందిపడ్డారు

వరంగల్/హైదరాబాద్: టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ యువకుడు.. టిక్కెట్ కలెక్టర్ రావడంతో రన్నింగ్ రైలు నుంచి దూకి, ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటన గురువారం జరిగింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా కేసముద్రం వద్ద చోటు చేసుకుంది.

రమేష్ అనే యువకుడు టిక్కెట్ కొనకుండా రైలు ఎక్కాడు. టికెట్ కలెక్టర్ చెకింగ్ చేసేందుకు వస్తుండటంతో గమనించిన అతను దిక్కుతోచక వేగంగా వెళుతున్న రైలు నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

Youth jumps from running train

ఆ యువకుడు ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ సంఘటన జరిగింది. రమేష్‌ను తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజిఎంకు తరలించారు.

ఇద్దరు మహిళల అశ్లీల నృత్యాలు

హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కాలనీలో మహిళలు అశ్లీల నృత్యాలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల ముసుగులో నిర్వాహకులు మహిళళతో అశ్లీల డ్యాన్సులు ఏర్పాటు చేశారు. దీని పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

తొలుత ఆర్కెస్ట్రాతో ప్రారంభించి.. ఆ తర్వాత అసభ్యకర నృత్యాలకు తెరలేపారు. పెద్ద సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. దీంతో, స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఇద్దరు యువతులు అశ్లీల నృత్యాలు చేసినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+