పెళ్లికి ఒప్పుకోలేదు: లవర్‌ని కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు

హైదరాబాద్: పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు ప్రియురాలిని కత్తితో అత్యంత దారుణంగా పొడిచి చంపాలని ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉంటే నిందితుడి పట్టుుకన్న స్థానికులు దేహశుద్ధి చేసి మరి పోలీసులకు అప్పగించారు.

బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్ కె.కిరణ్ కథనం ప్రకారం.. హస్మత్‌పేట దుబాయిగేట్ ప్రాంతానికి శ్రవణ్‌కుమార్(25) తిరుపతి అనే కొరియర్ సంస్థలో కొరియర్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. కాగా, శ్రవణ్‌కుమార్ గతంలో దుబాయిగేట్‌లోని క్వాలిటీ సూపర్‌మార్కెట్‌లో పనిచేశాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి(22) కూడా అక్కడే పనిచేయడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.

అది కాస్త ప్రేమగా మారింది. దీంతో ఆ యువతి ప్రేమ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసింది. అందుకు వారు నిరాకరించారు. ఆమెను ఉద్యోగం మాన్పించారు. వారి బంధువుతో ఆమె పెళ్లికి నిశ్చయించారు. విషయం తెలుసుకున్న శ్రవణ్‌కుమార్ రెండు రోజుల క్రితం ఆ యువతి తన అక్క కూతురుని పాఠశాలలో వదిలేందుకు వెళ్లింది.

పెళ్లికి ఒప్పుకోలేదు: లవర్‌ని కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు

పెళ్లికి ఒప్పుకోలేదు: లవర్‌ని కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు

దీంతో అక్కడికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని.. లేదంటే తీవ్ర పరిణమాలుంటాయని హెచ్చరించాడు. విషయాన్ని ఆ యువతి తన కుటుంబసభ్యులకు తెలియజేసింది. దీంతో వారు శ్రవణ్ ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. తమ అమ్మాయి జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు.

 పెళ్లికి ఒప్పుకోలేదు: లవర్‌ని కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు

పెళ్లికి ఒప్పుకోలేదు: లవర్‌ని కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు

కాగా, గురువారం ఉదయం సదరు యువతి ఉద్యోగాన్వేషణలో భాగంగా తన స్నేహితురాలితో కలిసి దుబాయిగేట్ సమీపంలోని ఇక్రిశాట్ కాలనీ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా శ్రవణ్‌కుమార్ అడ్డు తగిలి పెళ్లి విషయమై మళ్లీ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. పెళ్లికి యువతి నిరాకరించడంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

 పెళ్లికి ఒప్పుకోలేదు: లవర్‌ని కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు

పెళ్లికి ఒప్పుకోలేదు: లవర్‌ని కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు

తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో ఆమె కడుపు, మెడపై విచక్షణ రహితంగా పొడిచాడు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. స్థానికులు అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. నిందితుడు శ్రవణ్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

 పెళ్లికి ఒప్పుకోలేదు: లవర్‌ని కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు

పెళ్లికి ఒప్పుకోలేదు: లవర్‌ని కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీంను రంగంలోకి దింపి వివరాలను సేకరించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. కేసును ఎస్సై శ్రీనివాస్ దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడు శ్రవణ్ తన వెంట రెండు కత్తులు తెచ్చుకున్నాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+