జగన్ మోసం చేసినట్లు ఆధారాలున్నాయి: కోర్టులో సీబీఐ కౌంటర్
అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతోపాటు కేసులో ఏ2గా ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి కూడా కోర్టు విచారణకు వచ్చారు.
ఈ సందర్భంగా రాంకీ, వాన్ పిక్, జగతి పబ్లికేషన్‌ల పెట్టుబడుల ఛార్జ్ షీట్ నుంచి తన పేరును తొలగించాలంటూ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే, జగన్ విజ్ఞప్తిని సీబీఐ తోసిపుచ్చింది.

పెట్టుబడిదారులను జగన్మోహన్ రెడ్డి మోసం చేసినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని కోర్టుకు తెలిపింది. జగన్ వేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేయాలని సీబీఐ కోరింది. ఈ క్రమంలో తదుపరి విచారణను అక్టోబర్ 6కు కోర్టు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications