10మందితో సీఎం అని పిలిపించుకుంటే, ఎవరైనా ఊహించారా: బీజేపీపై జానా
తాను ముఖ్యమంత్రిని అవుతానని ఎప్పుడూ చెప్పలేదని, నేను సీఎం అని పదమందితో అనిపించుకుంటానని, అంతమాత్రాన అవుతామా? ఎవరో అనగానే సీఎం అయిపోతామని తాను భ్రమలో ఉండనని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు.
హైదరాబాద్: తాను ముఖ్యమంత్రిని అవుతానని ఎప్పుడూ చెప్పలేదని, నేను సీఎం అని పదమందితో అనిపించుకుంటానని, అంతమాత్రాన అవుతామా? ఎవరో అనగానే సీఎం అయిపోతామని తాను భ్రమలో ఉండనని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు.
తాను సీఎం అవుతానని ఎప్పుడూ చెప్పలేదని, అలా అనుకోలేదన్నారు. ఎవరి అభిమానాన్ని బట్టి వారు పిలుచుకుంటారన్నారు. ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. గతంలో కేవలం రెండే సీట్లు దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఎవరైనా ఊహించారా అన్నారు.
తాను సర్వేలపై ఆధారపడనని, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ సర్వేలు చేయించుకోలేదన్నారు.కేసీఆర్ వేసిన మార్కులతో తనకు సంబంధం లేదన్నారు. సర్వేలు కాదు ఆత్మవిశ్వాసమే ముఖ్యమన్నారు.
అయినా ప్రభుత్వ ఖర్చుతో సర్వేలు చేయొచ్చా? దుబారాల్లో ఇదో భాగమన్నారు. ఈ రోజుల్లో మీడియా కూడా సరిగా సర్వేలు చేయలేకపోతోందన్నారు. ప్రజల తీర్పే ఫైనల్ అన్నారు. తాను ఓడిపోతానని ఎన్నో సర్వేలు రాశారని, కానీ అవి జరగలేదన్నారు. ఇతర పార్టీలతో అవగాహన అనేది ఎన్నికలకు ముందు ఉంటే తతంగాలు అన్నారు.












Click it and Unblock the Notifications