రేవంత్ ఓటుకు నోటు, బాబు కార్నర్: తెలంగాణతో ఏపీకి జగన్ లింక్!

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు నిత్యం తెలంగాణలోని ఓటుకు నోటు అంశాన్ని తెరపైకి తెస్తున్నారు.

ఓటుకు నోటు కేసుతో తెలంగాణలో చంద్రబాబును, టిడిపిని కార్నర్ చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఏపీలో జగన్ కూడా ఇదే అంశంతో ఏపీలోని అధికార పార్టీని కార్నర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ప్రతి అంశానికి ఓటుకు నోటు అంశాన్ని తెరపైకి తెస్తున్నారు.

మంగళవారం నాడు తిరుమల ఎస్వీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మరోసారి ఓటుకు నోటు అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఏపీలోని అధికార పార్టీ పైన విరుచుకుపడిన ప్రతి సందర్భంలోను రేవంత్ రెడ్డి ఇష్యూను దాదాపు ప్రస్తావిస్తున్నారు.

YS Jagan using 'Cash for Vote'to corner Chandrababu

మంగళవారం ఎస్వీయులో జగన్ మాట్లాడుతూ... ఏపీలో పట్టిసీమ నుంచి పోలవరం దాకా.. ఇలా ఎన్నో వాటిల్లో తీసుకున్న లంచాలతో చంద్రబాబు పక్క రాష్ట్రంలోని తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.

తద్వారా, ఏపీలోని సొమ్మును తెలంగాణలో పెడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారని, అలా పదిహేడు మంది ఎమ్మెల్యేలకు ఇవ్వాలని, అప్పుడు ఎన్నో కోట్లు అవుతుందని జగన్ గతంలోను అన్నారు. అందుకు వీడియో, ఆడియో సాక్షాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఏపీలో చంద్రబాబును కార్నర్ చేసేందుకు జగన్... రేవంత్ రెడ్డి ఇష్యూను పదేపదే ప్రస్తావిస్తున్నారని చెప్పవచ్చు. కొద్ది నెలల క్రితం తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు డబ్బులు ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+