రోజానే తొలుత పరిచయం చేసిన జగన్, షి ఈజ్ డేరింగ్ అని వెంకయ్య
వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా విషయమై మీడియాలో ఇటీవల విభేదాలు అంటూ వార్తలు వచ్చాయి. రోజా తీరుతో జగన్ విసిగిపోయారని, ఆమెకు క్లాస్ పీకారని ప్రచారం జరిగింది.
హైదరాబాద్: వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా విషయమై మీడియాలో ఇటీవల విభేదాలు అంటూ వార్తలు వచ్చాయి. రోజా తీరుతో జగన్ విసిగిపోయారని, ఆమెకు క్లాస్ పీకారని ప్రచారం జరిగింది.
అంతేకాదు, రోజా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో చేరుతారని కూడా పుకార్లు వచ్చాయి. అయితే, వీటన్నింటిని రోజా కొట్టి పారేశారు. తలాతోక లేని జనసేనలో తాను ఎందుకు చేరుతానని ఆ తర్వాత చెప్పారు.
అయితే, జగన్ - రోజాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తాజాగా ఓ సంఘటనతో అర్థమవుతోందంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫున పోటీ చేస్తున్న రాంనాథ్ కోవింద్ హైదరాబాద్ వచ్చారు.

హోటల్లో వైసిపి నేతలతో కోవింద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ ఆయనకు తొలుత రోజానే పరిచయం చేశారు.
ఇంకో విషయం ఏమంటే.. రోజాను కోవింద్‌కు పరిచయం చేస్తున్న సమయంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఈమె డేరింగ్ అండ్ డాషింగ్ యాక్టివ్ వుమెన్ ఇన్ పాలిటిక్స్ అని వ్యాఖ్యానించారట.












Click it and Unblock the Notifications