వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

YS Sharmila నిప్పులు: నిరుద్యోగుల చావుకు కేసీఆరే కారణం.. వైఎస్ షర్మిల

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ కారణం అని వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. నేరేడుచర్ల మండలం మేడారంలో నిరుద్యోగులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి సీఎం కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని.. నాడు తెలంగాణ కోసం యువత ఆత్మ బలిదానం చేసుకుంటే.. నేడు ఉద్యోగాల కోసం బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు.

ys sharmila angry on cm kcr

ఉద్యోగ ఖాళీలు ఉన్నా కేసీఆర్ వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌కు రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ యువతకు ఉద్యోగాల కల్పన మీద లేదన్నారు. పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు ఆ కడుపు గోస తెలుస్తుందన్న షర్మిల.. పిల్లలకి మంచి మంచి పదవులు ఇచ్చుకున్న కేసీఆర్ లాంటి వారికి ఎలా తెలుస్తుందన్నారు. జంబో డీఎస్సి పేరుతో ఒకేసారి 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత వైఎస్సార్ దేనని.. ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి కేసీఆర్ కు పట్టింపు లేదు.. ఇప్పటికైనా కేసీఆర్ నిద్ర నుండి లేచి ఉద్యోగ ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేయాలన్నారు.

తొలగించిన అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కేసీఆర్ ఇంటికో ఉద్యోగం మాట నిలబెట్టుకోవాలన్నారు. నిరుద్యోగి నీలకంఠ సాయి ఆత్మహత్య యత్నం చేశారని.. ఆ యువకుడిని పరామర్శించి ధైర్యం చెబుదాం అనుకున్నా.. మొదట బెదిరించి.. ఈ రోజు ఉద్యోగం ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ నాయకులు ఆ యువకుడిని ఇక్కడి నుండి తరలించారన్నారు. నీలకంఠ సాయికి ఉద్యోగం ఇస్తామనడం మా విజయం అని.. మా పోరాటానికి సర్కార్ భయపడుతోంది.. కదులుతుందన్నారు. యువత ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని.. మీకోసం నేను కొట్లాడుతానికే వచ్చానన్నారు.

English summary
ys sharmila slams cm kcr on unemployeement to youth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X