వైఎస్ షర్మిల ప్రకటనతో హాట్ సీట్ గా పాలేరు; షర్మిలకు కలిసొచ్చే రాజకీయ సమీకరణాలివే!!
తెలంగాణ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్న వైఎస్ షర్మిల పాదయాత్ర విషయంలో తెలంగాణ ప్రభుత్వం పై న్యాయ పోరాటం చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఇక హైకోర్టు వైయస్ షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దూకుడు పెంచిన వైయస్ షర్మిల తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానని కూడా స్పష్టం చేశారు. పాలేరు నుంచి వైయస్ షర్మిల పోటీకి దిగుతున్నట్టు ఖరారు చేశారు. దీని కోసం త్వరలో పాలేరులో పార్టీ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్టు వైయస్ షర్మిల ప్రకటించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల కోసం కార్యాచరణ కూడా త్వరలో ప్రకటించబోతున్నట్లు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. దీంతో వైయస్ షర్మిల పాలేరు నుంచి పోటీ చేయడంపై తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

పాలేరు నుండే ఎన్నికల బరిలోకి వైఎస్ షర్మిల.. స్పష్టం చేసిన వైఎస్సార్టీపీ అధినేత్రి
వైయస్ షర్మిల పాలేరు నుంచి ఎందుకు పోటీ చేస్తుంది? పాలేరు లో ఆమెకి కలిసివచ్చే అంశాలేంటి? పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తే విజయం సాధిస్తారా? అసలు షర్మిల దృష్టి పాలేరు పైనే ఎందుకు పడింది? అన్న అంశాలపై తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసిన అప్పటి నుంచి పాలేరు పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టిన వైఎస్ షర్మిల అక్కడి నుంచే ఎన్నికల బరిలోకి దిగుతారని అనేకమార్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఇక దీనిని తాజాగా వైయస్ షర్మిల కన్ఫామ్ చేశారు.

పాలేరులో రాజకీయాలు ఇలా
పాలేరు రాజకీయాల విషయానికి వస్తే పాలేరు కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకింగ్ గా ఉంది. అంతేకాదు పాలేరు లో రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉంది. ఇక గిరిజనులు ఉన్నప్పటికీ, గిరిజన ఓటర్లను తమవైపు తిప్పుకోవడం వైయస్ షర్మిల కు అంత పెద్ద కష్టం కాదు. పదిహేనుసార్లు పాలేరు లో ఎన్నికలు జరిగితే 11 సార్లు కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. అంతగా కాంగ్రెస్ పార్టీకి పాలేరు నియోజకవర్గంలో గట్టిపట్టు ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో జరిగిన ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ పాలేరులో విజయం సాధించింది అంటే తెలంగాణలో అధికార పార్టీ ప్రభావం అక్కడ పెద్దగా ఉండబోదు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది.

పాలేరులో షర్మిల పోటీ వెనుక బలమైన కారణం ఇదే
అంతేకాదు పాలేరు నియోజకవర్గంలో వైయస్సార్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. పాలేరు నియోజకవర్గంలో దివంగత వైఎస్ఆర్ పరిపాలించిన సమయంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారు. అక్కడ చాలామంది ఇళ్లల్లో ఇప్పటికీ వైఎస్ఆర్ ఫోటోలు కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. వైయస్సార్ కు ఉన్న అభిమానగణం, కాంగ్రెస్ పార్టీకి ఉన్న పట్టుతో అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఎన్నికల్లో కందాళ ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు.

పాలేరు నుండి షర్మిల పోటీకి లాభించే అంశాలు ఇవే
ఇక ఆయన కాస్త టిఆర్ఎస్ బాట పట్టడంతో కాంగ్రెస్ పార్టీలో, ప్రస్తుతం అక్కడ అనిశ్చితి కనిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు, వై యస్ ఆర్ అభిమానుల ఓటు బ్యాంకు, రెడ్డి సామాజికవర్గం అండదండలు తనకు మెండుగా ఉంటాయని భావిస్తున్న వైయస్ షర్మిల పాలేరు నియోజకవర్గం నుండి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎలక్షన్ కి వైయస్ షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటన చేయడంతో పాలేరు సీటు హాట్ సీటుగా మారింది. వైఎస్ షర్మిల పోటీ పక్కా కావటంతో అక్కడ షర్మిలకు ప్రత్యర్ధులు ఎవరు అన్న చర్చ జోరుగా సాగుతుంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications