వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రంలో రైతులు చనిపోతున్నా పట్టించుకోని కేసీఆర్ దేశ రాజకీయాలు వెలగబెడతారా? వైఎస్ షర్మిల

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ పై, కెసిఆర్ ప్రభుత్వ తీరుపై వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా రైతు సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్ షర్మిల, తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తెలంగాణ రైతాంగానికి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సీఎం కేసీఆర్ చోద్యం చూస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కౌలు రైతుల గురించి సీఎం కేసీఆర్ కు సూటి ప్రశ్న వేశారు వైయస్ షర్మిల.

Recommended Video

Ys Sharmila : ఇంటికొక్క ఉద్యోగం అన్నారు ..ఇప్పుడేమయ్యాయి పాలకుల మాటలు ? | Oneindia Telugu
కౌలు రైతులను రైతులలాగా ప్రభుత్వం భావించడం లేదు

కౌలు రైతులను రైతులలాగా ప్రభుత్వం భావించడం లేదు

తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులను రైతులలాగా ప్రభుత్వం భావించడం లేదని వైయస్ షర్మిల మండిపడ్డారు. కౌలు రైతులు బ్రతికి ఉన్నంత వరకు రైతు బీమా ఇవ్వాలని ఆమె సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. రైతు సమస్యలను పరిష్కరించటంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడంలేదని, రైతుల కష్టాలు కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆమె దుయ్యబట్టారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర సీఎంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో రైతుల పరిస్థితి ఇలానే ఉందా అంటూ ఆమె ప్రశ్నించారు.

కౌలు రైతులను రైతులుగా ఎందుకు చూడరు.. కేసీఆర్ కు సూటి ప్రశ్న

కౌలు రైతులను రైతులుగా ఎందుకు చూడరు.. కేసీఆర్ కు సూటి ప్రశ్న


కౌలు రైతు బతికి ఉన్నంత వరకు రైతు బీమా ఇవ్వాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన షర్మిల, కౌలు రైతులను రైతులుగా ఎందుకు చూడరు అంటూ ప్రశ్నించారు.
80 వేల పుస్తకాలు చదివి పడేసిన అపర మేధావి కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలని ఎద్దేవా చేశారు. కనీసం భూమి కూడా లేని అతి పేదవాడు వ్యవసాయం చేస్తూ ఉంటే ప్రభుత్వం కనీసం సహాయం చేయడం లేదని షర్మిల విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులపై వివక్ష చూపడం కేసీఆర్ కు తగదు

రైతులపై వివక్ష చూపడం కేసీఆర్ కు తగదు

ప్రత్యామ్నాయ పంటలు పండించుకోవాలని కేసీఆర్ కోరారు అని గుర్తు చేసిన ఆమె ప్రత్యామ్నాయ పంటలు వేసుకున్న రైతులకు గిట్టుబాటు ధర లభించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రైతులపై వివక్ష చూపడం కేసీఆర్ కు తగదని లేఖలో షర్మిల పేర్కొన్నారు.వయసుతో సంబంధం లేకుండా రైతు బీమా అమలు చేయాలని షర్మిల కోరారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుంటే న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ షర్మిల హెచ్చరించారు. రైతునని చెప్పుకునే కేసీఆర్ కు రైతుల సమస్యలు పట్టవా అంటూ షర్మిల ప్రశ్నించారు.

రైతులు చనిపోతున్నాకేసీఆర్ కు మానవత్వం లేదా?

రైతులు చనిపోతున్నాకేసీఆర్ కు మానవత్వం లేదా?


నిత్యం రైతులు చనిపోతున్నాకేసీఆర్ కు మానవత్వం లేదా అంటూ ఆమె కేసీఆర్ ను నిలదీశారు. రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చిన కేసీఆర్ కేవలం 35 వేల రుణం తీసుకున్న మూడు లక్షల మందికి మాత్రమే పంట రుణాలను మాఫీ చేశారని, 36 లక్షల మంది రైతులు కెసిఆర్ మోసం చేశారని విమర్శించారు. రైతులు తీసుకున్న రుణాలు బ్యాంకుల్లో ఇంకా అలాగే ఉన్నాయని షర్మిల పేర్కొన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వని కారణంగా రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకున్నారని షర్మిల పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ సీఎం కావడం మన ఖర్మ

తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ సీఎం కావడం మన ఖర్మ


తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ సీఎం కావడం మన ఖర్మ అంటూ షర్మిల పేర్కొన్నారు. ఇక అలాంటి ఆయన చేతిలో దేశాన్ని పెడితే ఏమైనా ఉంటుందా అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్లో కెసిఆర్ ప్రచారం ఒక జోక్ అని ఆమె అభివర్ణించారు. కెసిఆర్ సీఎం గా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ఆయన చేతుల్లో దేశాన్ని పెడితే ఆ సంఖ్య లక్షల్లో ఉంటుంది అంటూ షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ దేశ రాజకీయాలు వెలగబెడితే ఎలా ఉంటుందంటే, కెసిఆర్ లాంటి వ్యక్తి పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట అలా ఉంటుంది అంటూ వైయస్ షర్మిల సెటైర్లు వేశారు.

English summary
YS Sharmila made harsh remarks on Telangana CM KCR and KCR government. He was incensed that the government did not treat the tenant farmers as farmers. YS Sharmila has expressed impatience on national politics of kcr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X