వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

900మందికి ఒకే టాయిలెట్టా.. ముఖ్యమంత్రి కేసీఆర్ బతికే ఉన్నారా?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ పనితీరుపై, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్న వైయస్సార్టీటీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ ను, రాష్ట్ర మంత్రులను టార్గెట్ చేశారు. బి ఆర్ ఎస్ పేరుతో దేశ రాజకీయాలు చేస్తానంటున్న కేసీఆర్ రాష్ట్రంలోని ప్రజల సమస్యల పరిష్కరించడంలో విఫలమవుతున్నారని ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. స్కూళ్ళలో విద్యా ప్రమాణాలు మెరుగు పరచడానికి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఏమాత్రం ప్రభుత్వం పనిచేయడం లేదని వైయస్ షర్మిల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

మేయర్ విజయలక్ష్మికి షాక్.. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వర్గం ఆందోళనతో తెరపైకి కొత్తపంచాయితీ!!మేయర్ విజయలక్ష్మికి షాక్.. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వర్గం ఆందోళనతో తెరపైకి కొత్తపంచాయితీ!!

ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి బతికే ఉన్నారా?

ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి బతికే ఉన్నారా?


తాజాగా రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో టాయిలెట్ల కోసం విద్యార్థులు రోడ్డెక్కారు అని ఒక వీడియోను పోస్ట్ చేసిన వైఎస్ షర్మిల విద్యార్థుల దయనీయమైన పరిస్థితులను ప్రశ్నించారు. తొమ్మిది వందల మంది విద్యార్థులు చదువుకుంటున్న కళాశాలలో ఒకే టాయిలెట్ నా అంటూ ప్రశ్నించిన వైయస్ షర్మిల ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి బతికే ఉన్నారా అంటూ ప్రశ్నించారు. ఒకవేళ బతికే ఉంటే వారికి విద్యార్థుల గోస కంటికి కనిపించడం లేదా అంటూ నిలదీశారు.

కనీసం బాత్రూంలు కూడా కట్టించని ముఖ్యమంత్రి ఉంటే ఎంత? ఊడితే ఎంత

కనీసం బాత్రూంలు కూడా కట్టించని ముఖ్యమంత్రి ఉంటే ఎంత? ఊడితే ఎంత


900 మంది చదివే కళాశాలలో ఒక బాత్రూమ్ ఉండటమా అంటూ అసహనం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి ఇలాకాలోనే పిల్లలు టాయిలెట్ ల కోసం రోడ్డెక్కిన పరిస్థితిని ఆమె ప్రశ్నించారు. ఇదేనా తెలంగాణా ప్రభుత్వ గొప్పతనం అని ఆమె నిలదీశారు. పిల్లలకు కనీసం బాత్రూంలు కూడా కట్టించని ముఖ్యమంత్రి ఉంటే ఎంత? ఊడితే ఎంత? అంటూ విరుచుకుపడ్డ వైయస్ షర్మిల, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సైతం టార్గెట్ చేశారు.

 మూత్రం వస్తుందేమోనని నీళ్లు కూడా తాగడం లేదని చెప్తుంటే ఏ సమాజంలో ఉన్నాం మనం?

మూత్రం వస్తుందేమోనని నీళ్లు కూడా తాగడం లేదని చెప్తుంటే ఏ సమాజంలో ఉన్నాం మనం?


పిల్లల సమస్యలు పట్టించుకోని విద్యాశాఖ మంత్రి ఉంటే ఎంత? ఊడితే ఎంత? అంటూ అసహనం వ్యక్తం చేశారు. బాత్ రూం వెళ్లకుండా, పీరియడ్స్ రాకుండా టాబ్లెట్ వేసుకుంటున్నాం అంటున్న బాలికల మాటలు వినడానికే భయానకంగా ఉన్నాయని వైయస్ షర్మిల పేర్కొన్నారు. మూత్రం వస్తుందేమోనని నీళ్లు కూడా తాగడం లేదని చెప్తుంటే ఏ సమాజంలో ఉన్నాం మనం? అనిపిస్తుందని, ఇదేనా మీ పాలన అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మీది దరిద్రపు పాలన అని చెప్పడానికి ఇదొక్కటి చాలు అంటూ వైఎస్ షర్మిల తెలంగాణ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థుల కష్టాలను ఏకరువు పెట్టారు.

 పేద విద్యార్థినిల ఆత్మగౌరవం పట్టదా?

పేద విద్యార్థినిల ఆత్మగౌరవం పట్టదా?


మీ గడీలకు,ఫామ్ హౌజ్ బాత్ రూంలకు బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకొనే మీకు పేద విద్యార్థినిల ఆత్మగౌరవం పట్టదా? అంటూ వైయస్ షర్మిల సీఎం కేసీఆర్ ను నిలదీశారు. సర్కార్ విద్యకు అగ్రతాంబూలం అని గప్పాలు కొడుతున్న మీరు, ఇదేనా సర్కారీ విద్యకు మీరిచ్చే ప్రాధాన్యత? అంటూ అసహనం వ్యక్తం చేశారు వైయస్ షర్మిల. సీఎం కేసీఆర్ పాలనలో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు అంటూ పేర్కొన్నారు. పనికిరాని ప్రాజెక్టులకు లక్షల కోట్ల రూపాయల తగలేసే మీరు పేద విద్యార్థులకు బాత్రూంలు ఎందుకు కట్టడం లేదని ప్రశ్నించిన షర్మిల, కమీషన్లు రావనా పేద విద్యార్థులకు బాత్రూంలు కట్టడం లేదన్నారు. విద్యార్థులు తమ సమస్యలను ఏకరువు పెడుతున్న వీడియో లను పోస్ట్ చేసి మరీ ప్రశ్నించారు.

English summary
YS Sharmila, questioned about the existence of only one toilet for 900 students in Sarur Nagar Government Junior College of Rangareddy district, asked if the Chief Minister and the Education Minister are alive in this state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X