నువ్వు కేటీఆర్ కోవర్ట్.. రాజకీయ వ్యభిచారి: జగ్గారెడ్డిపై మళ్ళీ విరుచుకుపడ్డ వైఎస్ షర్మిల
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై వైయస్ షర్మిల మరో మారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేటీఆర్ కోవర్ట్ అని, ఈ విషయం గాంధీభవన్ మొత్తం తెలుసు అని వైఎస్ షర్మిల ఆరోపించారు. వైయస్సార్ తనను పార్టీలోకి పిలిచాడని జగ్గారెడ్డి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా పార్టీ మారాడని జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. అసలు వైయస్సార్ పార్టీ మారాడా? ఎప్పుడు మారాడు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

మీలా పార్టీలు మారే ఖర్మ వైఎస్సార్ కు పట్టలేదు: వైఎస్ షర్మిల
వైయస్సార్ గెలిచిన పార్టీనే కాంగ్రెస్ లో కలిసిపోయిందని, ఆ మాత్రం జ్ఞానం లేకుండా జగ్గారెడ్డి మాట్లాడుతున్నారని వైయస్ షర్మిల పేర్కొన్నారు. పార్టీలు మారాల్సిన ఖర్మ వైఎస్సార్ కు పట్టలేదని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. మీలా పార్టీలు మారుతూ రాజకీయ వ్యభిచారం చేసే సంస్కృతి వైయస్సార్ ది కాదు అంటూ వైయస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోమారు జగ్గారెడ్డి పార్టీల మార్పుపై మాట్లాడిన వైయస్ షర్మిల పొద్దున టిఆర్ఎస్ మధ్యాహ్నం బిజెపి సాయంత్రం కాంగ్రెస్ అంటూ ఎవరు పిలిస్తే అక్కడికి పోతావ్ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు.
వైఎస్సార్ మీ శీలం ఖరాబ్ చేశాడా? జగ్గారెడ్డి ని ప్రశ్నించిన షర్మిల
వైయస్సార్ వల్లే పార్టీ మారానని జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ షర్మిల వైయస్సార్ మీ శీలం కరాబ్ చేశాడా? పార్టీలు మారినందుకు ఎన్నిసార్లు శీలం దోచుకున్నారు జగ్గారెడ్డి అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది వైయస్ఆర్. కేంద్రంలో అధికారంలోకి తెచ్చేలా చేసింది వైయస్ఆర్. అలాంటి మహానేత మరణించగానే.. ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చి వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ అంటూ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.

కేటీఆర్ కోవర్టు మతి తప్పి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు
కేటీఆర్ కోవర్టు జగ్గారెడ్డి, మతి తప్పి మాట్లాడుతున్నాడని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో పార్టీ నువ్వు మారి వైయస్సార్ పైన పిచ్చిఎక్కి మాట్లాడుతున్నావా? అంటూ ప్రశ్నించారు. నీ నియోజకవర్గం కోసం ఏనాడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించావా? అంటూ నిలదీశారు. జ్ఞానం లేకుండా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారు అని పేర్కొన్నారు వైఎస్ షర్మిల. సంగారెడ్డి నియోజకవర్గానికి ఒక రోజు అయినా ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారా అంటూ నిలదీశారు. జగ్గారెడ్డి వల్ల సంగారెడ్డికి ఏమాత్రం లాభం లేదని, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నని వైయస్ షర్మిల ఎద్దేవా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న నువ్వు రేపు ఏ పార్టీలో ఉంటావో నీకే క్లారిటీ లేదు నువ్వా నా గురించి మాట్లాడేది అంటూ వైఎస్ షర్మిల జగ్గారెడ్డిని టార్గెట్ చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications