కాంగ్రెస్ లో షర్మిల చేరికలో బిగ్ ట్విస్ట్, వద్దే వద్దు - అర్దం అవుతోందా..!!

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ లో చేరికపై మరో ట్విస్టు చోటు చేసుకుంది. కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసేందుకు షర్మిల అంగీకరించారు. కాంగ్రెస్ షరతులకు ఆమోదం తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ కోసం పని చేసేందుకు సిద్దమయ్యారు. కానీ, అక్కడే ఊహించని పరిణామం చోటు చేసుకుంటోంది. షర్మిల పార్టీలో ప్రాధాన్యతపై కొందరు కాంగ్రెస్ నేతలు ససేమిరా అంటున్నారు. దీంతో, షర్మిలకు కాంగ్రెస్ రాజకీయం ఏంటో బోధపడుతోంది.

ఖర్గేతో షర్మిల సమావేశం: వైఎస్ షర్మిల రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసారు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటంతో పాటుగా అధికారికంగా అన్నింటి పైన పార్టీ హైకమాండ్ తో ఒప్పందం చేసుకొనేందుకు చర్చలు చేసారు. ప్రాధమికంగా ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ కేసీ వేణుగోపాల్ తో షర్మిల చర్చలు పూర్తి చేసారు.

YS Sharmila Congress

అంతిమంగా రాహుల్ తో సమావేశం..ఆ వెంటనే సోనియా సమక్షంలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీన ప్రక్రియ పూర్తి చేయాలని భావించారు. అందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సమావేశయ్యారు. రాహుల్ తో సమావేశం కోసం ప్రయత్నించి నా సాధ్య పడలేదు. ఇదే సమయంలో అసలు విషయం బయటకు వచ్చింది.

షర్మిల రాకపై అభ్యంతరాలు: షర్మిల కాంగ్రెస్ లో చేరటం..తెలంగాణ నుంచి పని చేయటం టీపీసీసీలోని ముఖ్య నేతలకు ఇష్టం లేదని తెలుస్తోంది. కొందరు నేతలు మినహా.. మెజార్టీ నేతలు షర్మిల కాంగ్రెస్ లోకి రావటం..తెలంగాణలో పని చేయటం పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ తో పాటుగా పలువురు బలహీన వర్గాలకు చెందిన నేతలు షర్మిల చేరికను వ్యతిరేకిస్తున్నారు.

పార్టీని విలీనం చేసి తెలంగాణలో కాకుండా ఏపీలో పని చేస్తే తమకు అభ్యంతరం లేదని చెబుతున్నట్లు సమాచారం. దీంతో, పార్టీ విలీనం కోసం అన్నింటికి సిద్దమై ఢిల్లీ వెళ్లిన షర్మిలకు పార్టీ అధినాయకత్వం నుంచి వచ్చిన సమాచారం తెలుసుకొని షాక్ అయ్యారు. దీంతో, హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు. తాను అన్ని విషయాలను త్వరలో వెల్లడిస్తానని ఆ పార్టీ అధినేత్రి షర్మిల పేర్కొన్నారు. ఆమె శుక్రవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

YS Sharmila Congress

షర్మిల ఏం చేయబోతున్నారు: షర్మిల పార్టీలో చేరటం ద్వారా ఏపీలోనూ కలిసి వస్తుందని కాంగ్రెస్ నాయకత్వం అంచనా వేస్తోంది. అయితే, షర్మిల తెలంగాణ నుంచే పోటీ చేస్తానని చెప్పటం, పార్టీలో ప్రాధాన్యత ఇస్తానని హైకమాండ్ హామీ ఇవ్వటం టీపీసీసీ నాయకత్వానికి రుచించటం లేదు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో చేరినా, టీపీసీసీ నాయకత్వం ఏ మేర సహకరిస్తుందనేది సందేహంగానే కనిపిస్తోంది. అదే సమయంలో షర్మిల తెలంగాణ అసెంబ్లీకి వెళ్లాలని భావిస్తున్నారు.

ఇవన్నీ టీపీసీసీకి నచ్చటం లేదు. షర్మిల రాకను కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు స్వాగతిస్తున్నారు. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారిని తప్పు బట్టారు. షర్మిల రాక తో పార్టీకి మేలు జరుగుతుందని వాదిస్తున్నారు. వరుస పరిణామాలను గమనిస్తున్న షర్మిల..అంతిమంగా ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+