గవర్నర్ తమిళిసైతో వైఎస్ షర్మిల భేటీ.. పోలీసులపై ఫిర్యాదు; వినతిపత్రం!!
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. నేడు రాజ్ భవన్ కు చేరుకున్న వైయస్ షర్మిల గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు. నర్సంపేటలో ప్రజాప్రస్థానం పాదయాత్రలో చోటు చేసుకున్న పరిణామాలను, తాను బస చేసే బస్సును తగలబెట్టడాన్ని, ఆపై తమ పై రాళ్ల దాడి చేసి ఇబ్బంది పెట్టడాన్ని తమిళిసై దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం పోలీసులు తన పాదయాత్రను అడ్డుకోవడాన్ని, ప్రగతి భవన్ వద్ద నిరసన తెలిపేందుకు వెళుతుంటే చోటు చేసుకున్న పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్ కు వైయస్ షర్మిల ఫిర్యాదు చేశారు.

గవర్నర్ ను కలిసిన వైఎస్ షర్మిల... పోలీసులపై ఫిర్యాదు, వినతి పత్రం
నర్సంపేట లో ప్రజాస్వామ్య విధంగా పాదయాత్ర చేస్తున్న క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించిన వైయస్ షర్మిల తమ బస్సును తగలబెట్టిన వారిని, తమ పార్టీ కార్యకర్తలను కొట్టిన వారిని, తమపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు తెలియజేశారు.
రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను గవర్నర్ వద్ద ప్రస్తావించిన వైయస్ షర్మిల, తనపై జరిగిన దాడికి సంబంధించి అన్ని వివరాలు గవర్నర్ కు ఇచ్చారు. గవర్నర్ తమిళ సై ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు.
కేసీఆర్ సర్వేతోనే తన పాదయాత్ర అడ్డుకునే కుట్ర చేశారన్న వైఎస్ షర్మిల
అనంతరం వైఎస్ షర్మిల గవర్నర్ తమిళిసై ని కలిశానని, పాదయాత్రను అడ్డుకోవడం కోసం టిఆర్ఎస్ పార్టీ చేసిన కుట్రలను, చేసిన దాడులను గవర్నర్ కు వివరించానని వెల్లడించారు . సీఎం కెసిఆర్ డైరెక్షన్లోనే పాదయాత్ర అడ్డుకోవడానికి కుట్రలు జరిగాయని వైయస్ షర్మిల వెల్లడించారు. వైయస్ఆర్ తెలంగాణ పార్టీకి ఆదరణ వస్తుందనే భయంతోనే కేసీఆర్ ఈ విధంగా చేస్తున్నారని వైయస్ షర్మిల పేర్కొన్నారు.
3500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న వైయస్ఆర్ బిడ్డ, తెలంగాణ ప్రజల మద్దతు కూడగడుతున్నదని కెసిఆర్ సర్వే రిపోర్ట్ ఆధారంగా ఈ తరహా దాడులకు ముందే ప్లాన్ చేసుకున్నారన్నారు. దీని పైన గవర్నర్ కు ఫిర్యాదు చేశామని, గవర్నర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరామని వైయస్ షర్మిల తెలిపారు.
షర్మిల అరెస్ట్ ఘటనతో గవర్నర్ ట్వీట్... షర్మిలపై సానుభూతి
కాగా వైయస్ షర్మిల వ్యవహారంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఆమె పట్ల సానుభూతితో ఉన్నట్టు ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఒక ట్వీట్ ఆధారంగా తెలుస్తోంది. వైయస్ షర్మిల కారు లోపల ఉన్నప్పుడే కారు దూరంగా లాగుతున్న దృశ్యాలు తన మనసును కలవరపెట్టాయని, మహిళల పట్ల ఈ అనుచిత వ్యాఖ్యలు తగదని తమిళిసై సౌందరరాజన్ పోస్ట్ చేశారు. వైయస్ షర్మిల తో పాటు ప్రధాన మంత్రి కార్యాలయాన్ని, తెలంగాణ డీజీపీ లను తన పోస్ట్ లో ట్యాగ్ చేశారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications