అండగా ఉంటాం: పరామర్శ యాత్రలో షర్మిల(పిక్చర్స్)
వరంగల్: దివంగత సిఎం వైయస్సార్ మరణవార్త విని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, ఆ పార్టీ నేత షర్మిల హామీ ఇచ్చారు. మంగళవారం వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో షర్మిల చేపట్టిన పరామర్శ కొనసాగింది.
దివంగత సిఎం వైయస్సార్ అకాల మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. స్టేషన్ ఘన్‌పూర్, నమిలిగొండ, తాటికొండ, కిష్టాజీగూడెం గ్రామాల్లోని బాధితుల ఇళ్లకు వెళ్లి ఓదార్చారు.
నమిలిగొండలో మృతి చెందిన గాదె శంకర్ భార్య యాకమ్మ, పిల్లలను పరామర్శించిన ఆమె వారికి అండగా ఉంటామని చెప్పారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో లక్ష్మయ్య, తాటికొండలో ఎడమ మల్లయ్య, కిష్టాజీగూడెంలో కొమురయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అధికార ప్రతినిధి రాఘవరెడ్డి, జిలా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జీ విలియమ్స్, నోముల జయపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

షర్మిల
దివంగత సిఎం వైయస్సార్ మరణవార్త విని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, ఆ పార్టీ నేత షర్మిల హామీ ఇచ్చారు.

బాధితులకు పరామర్శ
మంగళవారం వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో షర్మిల చేపట్టిన పరామర్శ కొనసాగింది.

బాధితులకు పరామర్శ
దివంగత సిఎం వైయస్సార్ అకాల మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.

బాధితులకు పరామర్శ
స్టేషన్ ఘన్‌పూర్, నమిలిగొండ, తాటికొండ, కిష్టాజీగూడెం గ్రామాల్లోని బాధితుల ఇళ్లకు వెళ్లి ఓదార్చారు.

బాధితులకు పరామర్శ
నమిలిగొండలో మృతి చెందిన గాదె శంకర్ భార్య యాకమ్మ, పిల్లలను పరామర్శించిన ఆమె వారికి అండగా ఉంటామని చెప్పారు.

బాధితులకు పరామర్శ
స్టేషన్ ఘన్‌పూర్‌లో లక్ష్మయ్య, తాటికొండలో ఎడమ మల్లయ్య, కిష్టాజీగూడెంలో కొమురయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.

వైయస్ షర్మిల
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అధికార ప్రతినిధి రాఘవరెడ్డి, జిలా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జీ విలియమ్స్, నోముల జయపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైయస్ షర్మిల
దివంగత సిఎం వైయస్సార్ మరణవార్త విని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, ఆ పార్టీ నేత షర్మిల హామీ ఇచ్చారు.

వైయస్ షర్మిల
దివంగత సిఎం వైయస్సార్ అకాల మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.

Click it and Unblock the Notifications