బీఆర్ఎస్ నాయకులపై మహిళా కమీషన్ కు వైఎస్ షర్మిల ఫిర్యాదు; చర్యలకు డిమాండ్!!
బీఆర్‌ఎస్ నేతలపై మహిళా కమిషన్‌కు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఆమె పాదయాత్రను అడ్డుకొని తిరిగి ఆమె హైదరాబాద్లోని ఆమె నివాసానికి తరలించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ కొజ్జా అంటూ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా, తాజాగా ఆమె మహిళల పట్ల బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ మహిళా కమిషన్లో ఫిర్యాదు చేశారు.

వారిపై చర్యలు తీసుకోండి.. మహిళా కమీషన్ లో షర్మిల ఫిర్యాదు
ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహిళలంటే గౌరవమే లేదని పేర్కొన్న వైయస్ షర్మిల, మహిళల పట్ల బిఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మహిళా కమీషన్ ను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, బానోతు శంకర్ నాయక్ పేర్లను ఆమె తన రెండు పేజీల ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి వ్యాఖ్యలు చాలా అవమానకరంగా ఉన్నాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

మహిళల పట్ల దాడులు.. అయినా స్పందించని బీఆర్ఎస్ మహిళా నేతలు
తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని పేర్కొన్న ఆమె మహిళలపై జరుగుతున్న అత్యాచారాలలో దేశంలోని తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని మహిళలను జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేసిన సంఘటనలు కూడా తెలంగాణలో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న దాడులపై బిఆర్ఎస్ మహిళా నేతలు కనీసం మాట్లాడటం లేదని వైయస్ షర్మిల అభిప్రాయపడ్డారు.

భూకబ్జాలను ప్రశ్నిస్తే శిఖండి అంటాడా? మహబూబాబాద్ ఎమ్మెల్యే టార్గెట్
మహబూబాబాద్ ఎమ్మెల్యే అక్రమ భూ ఆక్రమణలను తాను ప్రశ్నించానని ఆయన తనను నపుంసకుడని, శిఖండి అని పిలిచి అవమానించారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. గతంలో గవర్నర్ ను కూడా కించపరిచి మాట్లాడారని, అసభ్య పదజాలంతో గవర్నర్ ను కూడా దూషించారన్నారు. కెసిఆర్ సర్కార్ ను నిలదీస్తే తనను నానా మాటలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనను మాత్రమే కాదు, గతంలో ఒక మహిళా అధికారి చెయ్యి పట్టుకున్నారని అటువంటి వారికి మహిళల మీద గౌరవం ఉన్నట్టా .. అంటూ వైయస్ షర్మిల ప్రశ్నించారు.

చర్యలు తీసుకోకుంటే జాతీయ మహిళా కమీషన్ లో ఫిర్యాదు చేస్తా : షర్మిల వార్నింగ్
తాను తెలంగాణా మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేశానని పేర్కొన్న షర్మిల చర్యలు తీసుకోకుంటే మహిళా జాతీయ మహిళా కమిషన్ ను ఆశ్రయిస్తానని చెప్పారు. ఇక్కడ న్యాయం జరగకపోతే జాతీయ మహిళా కమిషన్ వద్ద తేల్చుకుంటానని వైఎస్ షర్మిల హెచ్చరించారు. మొత్తానికి వైఎస్ షర్మిల పాదయాత్ర ఎపిసోడ్ మళ్ళీ రాష్ట్రంలో రచ్చకు కారణంగా మారింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications