వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ లాంటోడు పందిరేస్తే కుక్కతోక తాకి కూలిపోయిందట..ఈ దరిద్రులు అవసరమా మనకు!!

|
Google Oneindia TeluguNews

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికి 218 రోజులుగా పాదయాత్ర చేస్తున్న షర్మిల 3 వేల 400 కిలోమీటర్ల మేర తన పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కొంపల్లి గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి వైయస్ షర్మిల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

గండ్ర రమణారెడ్డి ని టార్గెట్ చేసి వైయస్ షర్మిల విమర్శలు

వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకురావడానికి,వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించడంకోసం తాను పాదయాత్రను చేస్తున్నట్లుగా వైయస్ షర్మిల పేర్కొన్నారు.భూపాలపల్లి నియోజకవర్గం లోజరిగిన పాదయాత్ర లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ని టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల గండ్ర వెంకటరమణా రెడ్డి దోపిడీపై నిప్పులు చెరిగారు. గండ్ర వెంకట రమణారెడ్డి కుటుంబ పాలనను విమర్శించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి,నియోజకవర్గాన్ని గండ్ర కాంప్లెక్స్ గా మార్చుకున్నారని, మూడు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని వైయస్ షర్మిల విమర్శించారు.

 ఇలాంటి దరిద్రులు మనకు అవసరమా అని ప్రశ్నించిన షర్మిల

ఇలాంటి దరిద్రులు మనకు అవసరమా అని ప్రశ్నించిన షర్మిల

ఎన్నికల్లో ఎన్నో మాటలు చెప్పి ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైయస్ షర్మిల మండిపడ్డారు.భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భార్య మరో జిల్లాకు జడ్పీ చైర్మన్ గా పని చేస్తున్నారని,ఇక కొడుకు పామాయిల్ సీడ్ ల కాంట్రాక్టులకు రారాజు గా మారాడని వైయస్ షర్మిల విమర్శించారు.మనకు ఇలాంటి దరిద్రులు అవసరమా అంటూ వైయస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అంటే 3 కబ్జాలు 6దందాలు అంటూ వైయస్ షర్మిల తనదైన శైలిలోవిరుచుకు పడ్డారు.

కాంగ్రెస్ నుండి గెలిచి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయిన గండ్రది రాజకీయ వ్యభిచారం

గండ్ర వెంకటరమణా రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారని, రాజకీయ వ్యభిచారం చేస్తున్నారనివైయస్ షర్మిల ఆరోపించారు. గతంలో భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఉన్న స్పీకర్ మధుసూధనాచారిని కుటుంబ పాలన చేస్తున్నారని విమర్శించిన గండ్ర ప్రస్తుతం చేస్తున్నది ఏమిటి అని ప్రశ్నించారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా భూపాలపల్లి నియోజకవర్గ పరిస్థితి తయారైందని,పట్టించుకునే నాధుడే లేకుండా నియోజకవర్గం అభివృద్ధి శూన్యం గా మారిందని వైయస్ షర్మిల విమర్శించారు.

కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే మునిగింది.. ఎలాగో చెప్పిన షర్మిల సెటైర్లు

కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే మునిగింది.. ఎలాగో చెప్పిన షర్మిల సెటైర్లు

ఇక ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన వైయస్ షర్మిలకాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తనదైన శైలిలో మండిపడ్డారు.కెసిఆర్ లాంటోడు పందిరేస్తే కుక్క తోక తాకికూలిపోయిందట అంటూ వైయస్ షర్మిల సెటైర్ వేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి 38 వేల కోట్లతో పూర్తి చేయాలనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టునుకమీషన్ల కోసం 1.2 లక్షల కోట్లకు పెంచి నిర్మాణం చేస్తే అది మూడేళ్లకే మునిగిందని వైయస్ షర్మిల ఎద్దేవా చేశారు.వైయస్సార్కట్టిన దేవాదులఎత్తిపోతల ఏళ్లు దాటిన చెక్కుచెదరకుండా ఉందని పేర్కొన్న వైయస్ షర్మిల,అది కదా పనితనం అంటేఅని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్న సీఎం కేసీఆర్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ షర్మిల.

English summary
YS Sharmila satirized the CM KCR over Kaleswaram project. Bhupalapalli MLA Gandra Ramana Reddy was also targeted by sharmila.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X