కేసీఆర్ కుటుంబం మొత్తానికి ఆస్కార్ అవార్డులు ఇవ్వాల్సిందే: వదిలిపెట్టని వైఎస్ షర్మిల!!
వైయస్సార్ తెలంగాణా పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ను పాదయాత్ర చేయకుండా అడ్డుకున్నప్పటికీ ఆమె ఏమాత్రం తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై, కెసిఆర్ కుటుంబ పాలన పై విమర్శలు చేయడంలో వెనకడుగు వేయడం లేదు. ముఖ్యంగా కెసిఆర్ కుటుంబ సభ్యులను, వారి అవినీతిని టార్గెట్ చేస్తున్న వైఎస్ షర్మిల కెసిఆర్ కుటుంబం డ్రామాలు చేస్తుందంటూ టార్గెట్ చేశారు.

కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం నటులే.. ఎవరేం నాటకాలు ఆడారంటే ..: షర్మిల
కెసిఆర్ కుటుంబం మొత్తానికి ఆస్కార్ అవార్డులు ఇవ్వాలని, అంత గొప్ప నటులని టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల ఒకరేమో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె లేదని నాటకాలు ఆడుతారు అంటూ హరీష్ రావు ను టార్గెట్ చేశారు. ఇంకొకరు గడ్డాలు పెంచి దీక్షలు చేసినట్లు నాటకాలు ఆడతారని కెసిఆర్ ను టార్గెట్ చేశారు. మరొకరు అమాయకంగా బతుకమ్మ ఆడి లిక్కర్ మాఫియాను నడిపిందని కెసిఆర్ కుమార్తె కవిత ను విమర్శించారు. ఇంకొకరు ఉద్యోగాలు ఇవ్వకున్నా హామీల కంటే ఎక్కువే ఇచ్చినట్లు నాటకాలు ఆడుతున్నారని కేటీఆర్ ను టార్గెట్ చేశారు. కెసిఆర్ కుటుంబ డ్రామాలను ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు అంటూ వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు.

కెసిఆర్ అంటే కొట్టి చంపి రాజ్యాంగం .. కొత్త అర్ధం చెప్పిన వైఎస్ షర్మిల
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, అటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేసిన నియంత కేసీఆర్ అంటూ వైయస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దళిత ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పి ఇవ్వలేదని, దళితులకు 3 ఎకరాల భూమి లేదని, రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని చేయలేదని, ఇలా అన్నీ మోసాలు చేశారని కెసిఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సొంత రాజ్యాంగం నడిపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కెసిఆర్ అంటే కొట్టి చంపి రాజ్యాంగం అంటూ కెసిఆర్ అనే పదానికి కొత్త అర్థం చెప్పారు వైయస్ షర్మిల.

పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టె మర్చిపోయిన హరీష్ రావు కూడా గోబెల్స్ ప్రచారం
వైయస్ రాజశేఖర్ రెడ్డి పైన హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వైయస్ షర్మిల పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె మర్చిపోయిన మంత్రి హరీష్ రావ్ అంటూ టార్గెట్ చేశారు. తెలంగాణకు పెద్దపీట వేసిన మహానేత వైయస్ఆర్ అంటూ కొనియాడిన వైయస్ షర్మిల ఇక్కడ బోర్లు ఎక్కువగా ఉన్నాయని అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ పైనే తొలి సంతకం చేశారని గుర్తు చేశారు . జలయజ్ఞం ప్రాజెక్టులు ఇక్కడే ఎక్కువ నిర్మించారని పేర్కొన్నారు.పెట్రోల్ మీద పోసుకొని అగ్గిపెట్టె మర్చిపోయిన మంత్రి హరీష్ రావు వైయస్ రాజశేఖర్ రెడ్డి మీద గోబెల్స్ ప్రచారం చేయడం సిగ్గుచేటు అంటూ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

వినేటోడు ఎర్రిపప్ప ఐతే చెప్పేటోడు ఎన్నైనా చెప్తాడట: కేటీఆర్ టార్గెట్ గా షర్మిల
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పిన వైఎస్ షర్మిల దక్షిణ భారతంలోనే తెలంగాణ నిరుద్యోగం లో తొలి స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి నోటి మాటలేనా? అంటూ కేటీఆర్ ను నిలదీశారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం దక్షిణ భారతంలోనే నిరుద్యోగంలో తెలంగాణ తొలిస్థానంలో ఉంది.'వినేటోడు ఎర్రిపప్ప ఐతే చెప్పేటోడు ఎర్రిమాటలు ఎన్నైనా చెప్తాడట' అంటూ వైఎస్ షర్మిల కేటీఆర్ ను టార్గెట్ చేశారు. 80వేల పుస్తకాలు చదివిన మీ అయ్యకు,ఇలాంటి కబుర్లు చెప్పే నీకు సర్కార్ కొలువు ఇవ్వడం అంటే తెలుసా? అంటూ ఆమె నిప్పులు చెరిగారు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications