డిగ్రీ కాలేజ్ కూడా తేలేనోడు మంత్రి: ఎర్రబెల్లిపై షర్మిల ఘాటువ్యాఖ్యలు!!
డిగ్రీ కాలేజ్ కూడా తేలేనోడు మంత్రి అంటూ పాలకుర్తి సభలో ఎర్రబెల్లిపై షర్మిల ఘాటువ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు.
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. పాదయాత్రలో దూకుడుగా ముందుకు వెళ్తున్న షర్మిల కేసీఆర్ కుటుంబ పాలనను టార్గెట్ చెయ్యటంతో పాటు ఏ నియోజక వర్గానికి వెళ్ళినా అక్కడ స్థానిక ఎమ్మెల్యేల పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలాకా అయిన పాలకుర్తిలో ప్రజాప్రస్థానం పాదయాత్రను సాగిస్తున్న షర్మిల మంత్రి నియోజకవర్గంలో మంత్రిపైనే షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

మంత్రి ఎర్రబెల్లిని టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ కూడా తెచ్చుకోలేనోడు మంత్రి అంట అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను ఉద్దేశించి వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. టిడిపిలో ఉన్నప్పుడు కేసీఆర్ ను రాక్షసుడు అన్న మంత్రి దయాకర్ రావు, టిఆర్ఎస్ లో చేరిన తర్వాత కేసీఆర్ ను దేవుడు అంటున్నారని షర్మిల పేర్కొన్నారు. మంత్రి నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించాలంటూ వైయస్ షర్మిల ప్రశ్నించారు. కెసిఆర్ పాలనలో బడులు, గుడుల,కంటే బార్లు, బెల్టు షాపులే ఎక్కువగా ఉన్నాయని వైయస్ షర్మిల పేర్కొన్నారు. అందుకే మంత్రి దయాకర్ రావు సర్పంచులను బీరు సీసాలు అమ్ముకొని ఆదాయం తెచ్చుకోవాలన్నాడని వ్యాఖ్యలు చేశారు.

ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి2
ఇక ఇదే సమయంలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి.. దొంగ అని, ఆయన దొంగ యాత్ర చేస్తున్నాడని వైయస్ షర్మిల మండిపడ్డారు. ఆయనది పాదయాత్ర కాదు కారు యాత్ర అని సొంత పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని షర్మిల పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరూ కేసీఆర్ కు అమ్ముడుపోయారని, ముందు ముందు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరిస్థితి అదే విధంగా ఉంటుందని పేర్కొన్న షర్మిల, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఇన్నాళ్లు కాంగ్రెస్, బిజెపి మొద్దునిద్ర వల్లే కెసిఆర్ అక్రమాలు
కాళేశ్వరంతో సాగు నీళ్లు రాలేదు. మిషన్ భగీరథతో మంచి నీళ్లు రాలేదు. రూ.లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి, కేసీఆర్ కుటుంబం కమీషన్లు దండుకుంది. ఏది చేసినా అందులో కమీషన్లే అంటూ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ ఖజానాను కొల్లగొట్టి, ప్రజలను ఆగం జేశారని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ అక్రమాలపై ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేసింది వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాత్రమేనని షర్మిల పేర్కొన్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్, బిజెపి మొద్దునిద్ర వల్లే కెసిఆర్ అక్రమాలు సాగాయని వైయస్ షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు. వైయస్సార్ సంక్షేమ పాలనను అందుబాటులోకి తీసుకురావడానికి తను తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీని పెట్టానని, తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చానని వైయస్ షర్మిల పేర్కొన్నారు.
-
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications