Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూనే.. క్లౌడ్ బరస్ట్ తోపాటు అవి చూడాలని వైఎస్ షర్మిల చురకలు

ఇటీవల తెలంగాణ ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు కాలికి గాయం కావడంతో డాక్టర్లు మూడు వారాలు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. అంతేకాదు విశ్రాంతి తీసుకునే సమయంలో ఏవైనా ఓటీటీ కంటెంట్ చూడడానికి సలహా ఇవ్వమని మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో కోరారు. దీంతో చాలామంది కేటీఆర్ కు అనేక సినిమాలను, వెబ్ సిరీస్ ను సూచిస్తున్నారు.

మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని సూచిస్తూనే షర్మిల చురకలు


ఇక ఓటీటీ సంస్థలు, రాజకీయ ప్రముఖులు, నెటిజన్లు, కేటీఆర్ అభిమానులు విభిన్న రీతిలో కేటీఆర్ కు అనేక సినిమాలను, వెబ్ సిరీస్ లను సూచిస్తుంటే వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల మాత్రం కేటీఆర్ కు సున్నితంగా చురకలు అంటించారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూనే మీ ఆనందం కోసం మీరు చూడాల్సిన సినిమాలు కుట్ర సిద్ధాంతం అని టిఆర్ఎస్ పేర్కొన్న క్లౌడ్ బరస్ట్, నీటమునిగిన ఇళ్ళు, మరియు పంప్ హౌస్ లు అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు వైయస్ షర్మిల.

పోలవరం , క్లౌడ్ బరస్ట్ కుట్రలు అంటున్న టీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడుతున్న షర్మిల

పోలవరం , క్లౌడ్ బరస్ట్ కుట్రలు అంటున్న టీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడుతున్న షర్మిల


ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలలో వరదల నేపథ్యంలో ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుంటున్న వైయస్ షర్మిల, వరదల బారినుండి ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం వైఫల్యం చెంది, పోలవరం కుట్రలు, క్లౌడ్ బరస్ట్ కుట్రలు అంటూ టిఆర్ఎస్ నేతలు కట్టుకథలు చెబుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఇక ఈ క్రమంలోనే కేటీఆర్ కు వాళ్లు చెప్పిన కుట్ర సిద్ధాంతం షోలే చూడాలంటూ సెటైర్లు వేశారు.

కేటీఆర్ కు సినిమాలు, వెబ్ సీరీస్ లు చూడటానికి సలహా ఇస్తూ పోటీ పడుతున్న ఓటీటీ సంస్థలు

కేటీఆర్ కు సినిమాలు, వెబ్ సీరీస్ లు చూడటానికి సలహా ఇస్తూ పోటీ పడుతున్న ఓటీటీ సంస్థలు


ఇదిలా ఉంటే కేటీఆర్ సోషల్ మీడియాలో చేసిన రిక్వెస్ట్ కు కేటీఆర్ అభిమానులు, సెలబ్రిటీలు మాత్రమే కాకుండా, పలు ఓటీటీ సంస్థలు కూడా కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తమ సంస్థ వెలువరించిన వెబ్ సిరీస్ లను, సినిమాలను సూచిస్తున్నాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా త్వరగా కోలుకోవాలంటే డీజే టిల్లు సినిమా చూడాలంటూ పేర్కొంది. అంతేకాదు బాలకృష్ణ యాంకర్ గా చేసిన ఎన్.బి.కె అన్ స్టాపబుల్, అమలాపాల్ నటించిన కుడిఎడమైతే, ప్రియమణి భామాకలాపం మిస్ కావద్దని సూచించింది.

మా ఓటీటీ చూస్తే చూస్తూనే ఉండిపోతారు అంటూ ట్వీట్లు

మా ఓటీటీ చూస్తే చూస్తూనే ఉండిపోతారు అంటూ ట్వీట్లు

ఇక దీనికి పోటీగా జీ5 కూడా కేటీఆర్ కు కొన్ని సినిమాలను, వెబ్ సిరీస్ లను సూచిస్తూ తమదైన శైలిలో ట్వీట్ చేసింది. కేటీఆర్ గారు గుడ్ మార్నింగ్ అంటూ పేర్కొన్న జీ5 మా నీళ్ళ ట్యాంక్ తో స్టార్ట్ చేసి రెక్కీ తో థ్రిల్ అవుతూ లంచ్ టైం కి ఫ్యామిలీ మొత్తం ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ కంప్లీట్ చేసి రాత్రికి ఆర్ఆర్ఆర్ చూసేయండి కానీ ఒక విషయం జాగ్రత్త చూస్తూనే ఉండిపోతారు అంటూ ఆసక్తికర ట్వీట్ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+